ఒడిశా రైలు ప్రమాదంపై అలాంటి ట్వీట్ చేసి డిలీట్ చేసిన కమెడియన్?

Rahul Ramakrishna Apologises Sharing Tweet Trains After Odisha Train Accident, Rahul Ramakrishna, Odisha, Odisha Train Accident, Tweet Viral

తాజాగా ఒడిశాలో( Odisha ) జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిసి వేసింది.దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 Rahul Ramakrishna Apologises Sharing Tweet Trains After Odisha Train Accident, R-TeluguStop.com

ఒకే ప్రదేశంలో దాదాపు మూడు రైళ్లు ప్రమాదానికి గురవడం, మాదాపూర్ 270 మందికి పైగా మృత్యువాత పడటం 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.ఆ ఘటన స్థలం అంతా కూడా ఏడుపులతో దద్దరిల్లిపోయింది.

ఆ ఘటనలో కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ భయంకరమైన రైలు ప్రమాదం గురించే వార్తలు ఫోటోలు వీడియోలు కనిపిస్తున్నాయి.

ఈ విషయం గురించి స్పందిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు.పలువురు సెలబ్రిటీలు( Celebrities ) సైతం ఈ ఘటనపై స్పందిస్తున్నారు.ఈ సమయంలో టాలీవుడ్ కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ( Rahul Ramakrishna ) అనుచిత ట్వీట్‌ చేశాడు.కాగా ఆ ట్వీట్ లో మండిపాటు సైలెంట్‌ అనే హాలీవుడ్‌ సినిమాలో నటుడు బస్టర్‌ కీటన్‌ ( Buster Keaton )రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియోని షేర్‌ చేశాడు.

దీంతో నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక పక్క వందల కుటుంబాలు ట్రైన్‌ యాక్సిడెంట్‌ లో సమాధి అయిపోతే మీకు కామెడీగా ఉందా? రైలు విన్యాసాలు షేర్‌ చేస్తున్నారేంటి? అని మండిపడ్డారు.

వెంటనే తప్పు తెలుసుకున్న రాహుల్‌ సదరు ట్వీట్‌ డిలీట్‌ చేసి క్షమాపణలు కోరాడు.సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు ఇంతకు ముందు చేసిన ట్వీట్‌పై క్షమాపణలు కోరుతున్నాను.ఒట్టేసి చెప్తున్నాను.ఆ విషాదం గురించి నాకసలు ఏమీ తెలియదు.అర్ధరాత్రి నుంచి స్క్రిప్ట్‌ రాసుకునే పనిలో ఉన్నాను.ఏ వార్తలూ చూడలేదు.

అందుకే తప్పు జరిగింది.మరోసారి క్షమాపణలు చెప్తున్నాను అని ట్వీట్‌ చేశాడు.

దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను.మిమ్మల్ని ట్రోల్‌ చేయాలనుకోలేదు.

కేవలం మీకు ఆ ఘటన గురించి మరింత సమాచారం ఇవ్వాలనుకున్నాను అని చెప్పుకొచ్చాడు.దీనికి రాహుల్‌ రిప్లై ఇస్తూ.

థాంక్యూ.గత కొన్ని గంటలుగా నేను న్యూస్‌ ఫాలో అవడం లేదు.

కేవలం నా పనిపైనే ఫోకస్‌ చేశాను.నన్ను అలర్ట్‌ చేసినందుకు థ్యాంక్స్‌ అని తెలిపాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube