రేవంత్ కు గుడ్ న్యూస్ చెప్పిన రాహుల్ ! ఆ పార్టీతో పొత్తు పై క్లారిటీ

చాలా రోజులుగా తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ – కాంగ్రెస్ ( BRS – Congress )పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి అనే ప్రచారం జరుగుతుంది.దేశవ్యాప్తంగా బిజెపిని అధికారంలోకి రాకుండా చేసేందుకు ఇప్పటికే కేసీఆర్( KCR ) టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించారు.

 Rahul Gave Good News To Revanth Clarity On Alliance With That Part , Telangana P-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే తెలంగాణతో పాటు,  దేశవ్యాప్తంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ లు పొత్తు  పెట్టుకుని ఉమ్మడిగా బిజెపిని ఎదుర్కొంటాయని ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ ప్రచారంపై చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఒకవేళ పొత్తు కనుక కుదిరితే ఇప్పటివరకు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ , కేటీఆర్ తో పాటు,  ఆ పార్టీ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తూ వస్తున్న తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన రేవంత్ రెడ్డిలో కనిపించింది.

బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని జనాల్లోకి ఏ విధంగా వెళ్లాలనే టెన్షన్ కూడా రేవంత్ లో కనిపిస్తూ వస్తుంది.

అయితే తాజాగా రేవంత్ కు  రిలీఫ్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )పొత్తుల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా జరిగిన చర్చలో కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో తెలంగాణ ఫోకస్ పెడతామని, 

తాను ఇక్కడే మకాం  వేస్తానని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు.ఇక బీఆర్ఎస్ తో పొత్తు అంశం పైన స్పందించిన రాహుల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని చెప్పారు.ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాహుల్ రాష్ట్ర నాయకులకు సూచించారు.దీంతో ఇప్పటి వరకు దీనిపై సందిగ్ధం  ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇక యాక్టివ్ గా బిజెపి , బీఆర్ ఎస్ లను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లే విధంగా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube