తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన విధంగా విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.ఏపీ, తెలంగాణ విభజన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడినా.
మూడోసారి మాత్రం తమ సత్తా చాటుకోగలిగింది.ఈ నేపథ్యంలోనే ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపించలేని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ ను యాక్టివ్ చేసి, త్వరలో ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఉండేలా ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
దీనికోసం ప్రత్యేకంగా భవిష్యత్ కార్యాచరణను అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ,కేసి వేణుగోపాల్ ,మాణిక్యం ఠాకూర్ , ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రద్దరాజు ( Gidugu Rudraraju ),సీనియర్ నేతలు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్ బలోపేతం చేసేందుకు ఏం చేయాలనే విషయం పైన ప్రధానంగా చర్చించారు.పార్టీలోకి చేరికలు, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, పొత్తులు, రాజకీయ వ్యవహారాలు, తదితర అంశాల పైన చర్చించారు.దీంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో( Congress Manifesto )లో ఏ ఏ అంశాలను చేర్చాలనే విషయం పైన ప్రధానంగా చర్చ జరిగింది.వచ్చే ఏడాది నుంచి ఏపీలో కాంగ్రెస్ తరఫున చేపట్టబోయే వివిధ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు.

సంక్రాంతి తర్వాత కొన్ని కీలక ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.హిందూపురంలో మల్లికార్జున ఖర్గే , విశాఖపట్నంలో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ,.అమరావతిలో ప్రియాంక గాంధీ సభలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.దీంతోపాటు వరుస వరుసగా కాంగ్రెస్ చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ప్రధానంగా దృష్టి సారించారు.
గతంలో కాంగ్రెస్ లో కీలకంగా ఉండి ఇతర పార్టీలో చేరిపోయిన నేతలను తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించే విధంగా వారితో సంప్రదింపులు చేపట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోంది.అలాగే ఏపీలో ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి, ఒంటరిగా వెళ్తే కాంగ్రెస్ విజయావకాశాల ఎలా ఉంటాయి ఇలా అనేక అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తోంది.