కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ “భారత్ జోడో యాత్ర”తో జాతీయ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు.ఈ పాదయాత్రలో రాజకీయ విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా దేశ ప్రజల మధ్య సహోదర భావం దెబ్బతీసే రీతిలో బీజేపీ వ్యవహరిస్తుందని సరికొత్తగా కామెంట్లు చేస్తున్నారు.
నాయకుడిగా ఈ పాదయాత్ర రాహుల్ నీ ప్రజల వద్దకు మరింత దగ్గరకు చేర్చింది అని చెప్పవచ్చు.ఇదిలా ఉంటే మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ బీజేపీలో కొనసాగటంపై రాహుల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ కుటుంబానికి ఒక భావజాలం ఉందని కానీ వరుణ్ గాంధీ మరో భావజాలాన్ని స్వీకరించారని చెప్పుకొచ్చారు.అయినా గాని వరుణ్ నీ కౌగిలించుకోనీ.ప్రేమగా మాట్లాడగలను అని తెలిపారు.కానీ అతను పుచ్చుకున్న రాజకీయ భావజాలాన్ని తాను స్వీకరించను అని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర చివరి దశకు చేరుకుంది.ఈ క్రమంలో వరుణ్ గాంధీ ఈ పాదయాత్రలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.