మరోసారి కరోనా వ్యాప్తి పై మాట్లాడిన రాహుల్....20 లక్షలకు చేరుకుంటాయంటూ...

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం విదితమే.

దేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుండటం తో పలు రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ విధిస్తూ చర్యలు చేపట్టాయి.

ఈ క్రమంలోనే దేశంలో కరోనా వ్యాప్తి పై తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.ప్రస్తుత స్థితిలో దేశంలో కరోనా కేసులు 10 లక్షలు దాటాయని ఇలాగె కొనసాగితే ఆగస్టు నాటికి ఈ కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుంది అని ఆయన జోస్యం చెప్పారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల స్థాయి 10 లక్షల మార్క్ దాటిన విషయం విదితమే.రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య అత్యధిక స్థాయిలో నమోదు అవుతుండడం తో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతి రోజూ కూడా దాదాపు 30 వేల వరకు కేసులు నమోదు అవుతున్నాయి.రోజు రోజుకు ఈ సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు.

Advertisement
India Will Cross 20Lakh Corona Cases, Rahul Gandhi, Rahul Gandhi Warning On Coro

మొదట్లో పదివేల కేసులు నమోదు అవుతుండగా ఆ తరువాత ఈ సంఖ్య 20 వేలకు,ఇప్పుడు ఏకంగా 30 వేలకు పెరుగుతూ వచ్చింది.ఇదే వేగంలో గనుక కరోనా కేసులు నమోదు అయితే నిజంగా ఈ కేసుల సంఖ్య 20 లక్షల కు చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదే విషయాన్నీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు.గతంలో కూడా ఒకసారి కరోనా వ్యాప్తి పై రాహుల్ మాట్లాడారు.

జులై 14 నాటికి పది లక్షల మార్క్‌కు చేరుకుంటామని ఆ సమయంలో తాను చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ గుర్తు చేశారు.మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పై కూడా రాహుల్ మండిపడ్డారు.

India Will Cross 20lakh Corona Cases, Rahul Gandhi, Rahul Gandhi Warning On Coro

ప్రధానమంత్రి మోడీ వరుసగా చేస్తున్న తప్పులు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని రాహుల్‌ గాంధీ విమర్శించారు.చైనాకు భారత్‌ సైనికులపై దాడి చేసే ధైర్యం ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడు ఎలా వచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు.మోడీ విదేశాంగ విధానంలోని వైఫల్యమే గాల్వాన్‌ ఘర్షణకు కారణమంటూ రాహుల్ మండిపడ్డారు.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు