టిఆర్ఎస్, బీజేపీ పార్టీలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర విజయవంతంగా జరుగుతుంది.పాదయాత్రలో రాహుల్ తో కలిసే అడుగులు వేయడానికి యువత ఇంకా మహిళలు ఉత్సాహం చూపిస్తున్నారు.

 Rahul Gandhi Sensational Comments On Trs Bjp Partys , Congress, Rahul Gandhi, Tr-TeluguStop.com

ఇదే సమయంలో పాదయాత్రలో రాహుల్ ఇస్తున్న హామీలు సంచలనం రేపుతున్నాయి.తెలంగాణలో జరుగుతున్న పాదయాత్రలో ఆదివారం నాడు రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ నీ మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.

కచ్చితంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

పేదల దగ్గర ప్రభుత్వం మరియు నాయకులు… లాక్కున్న భూములను మళ్లీ పేదలకే అప్పగిస్తామని పేర్కొన్నారు.షాద్ నగర్ లో జరిగిన మీటింగ్ లో మాట్లాడుతూ మోడీ పాలనలో దేశంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని అన్నారు.

గ్యాస్, పెట్రోల్, నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అని ధ్వజమెత్తారు.నల్ల చట్టాలు సహా పార్లమెంట్ లో బీజేపీ ప్రవేశపెడుతున్న ప్రతి బిల్లుకు టిఆర్ఎస్ మద్దతు తెలిపిందని… టిఆర్ఎస్ అదే విధంగా బీజేపీ పార్టీలు ఒకటే.

ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube