రాహుల్ ర్యాలీకి కరువైన జనం!

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పంజాబ్ లో రైతుల హక్కులను కాపాడేందుకు " ఖేతి బచావో" అనే ఆందోళన చేపడుతున్నారు.

ట్రాక్టర్ ర్యాలి తీస్తున్నారు, అయితే ఈ ర్యాలీ లకు జనం తక్కువగా హాజరవుతున్నారు.

కాంగ్రెస్ నేతల ప్రసంగాలు వినడానికి ఎవరు ఆసక్తి చూపట్లేదు.నిరసన కోసం వేసిన టెంట్ ల కింద కుర్చీలు చాలావరకు ఖాళీగానే ఉంటున్నాయి.

Rahul Meeting With No Pepole Rahul Gandhi, Congress, Hathras Issue, Punjab, Ama

దేశంలో బీజేపీ చేస్తున్న అభివృద్ధి కారణంగా కాంగ్రెస్ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా వారికి జనాల్లో ఆదరణ లేదని, ఇక వారి శకం ముగిసినట్టే అని చాలా మంది అనుకుంటున్నారు.పంజాబ్ లోని సంగరూర్ లో ట్రాక్టర్ ర్యాలీ లో ట్రాక్టర్ డ్రైవర్ లు తప్ప అసలు జనాలు లేరు.

రాహుల్ ప్రసంగించేటప్పుడు జనాలను ఆకర్షించడానికి ట్రాక్టర్లను నడిపారు, అందిన సమాచారం ప్రకారం ఒక్కో ట్రాక్టర్ కు రోజుకు ₹500 రూపాయల డీజిల్ ఖర్చు అయింది.ఇక్కడి జనం రాహుల్ ప్రసంగం కన్నా సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తి చూపుతున్నారు, దీనికి కారణం ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?

తాజా వార్తలు