తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన వివాదాలకు చోటుచేసుకుంటున్నాయి.రాష్ట్రంలో పర్యటన నేపథ్యంలో పోలిటీక్స్ హోరాహోరిగా మారుతున్నాయి.
అయితే రాహుల్ గాంధీ పర్యటనను సీరియస్ తీసుకున్న టీ కాంగ్రెస్ నేతలు పర్యటనను జయప్రదం చేయాలని నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సీటికి వెళ్లి వీసితో భేటీ కానున్నారు.
రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇవ్వాలని ఓయూ వీసీని రేవంత్ రెడ్డి కోరనున్నారు.
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఖాట్మండు నైట్ క్లబ్లో నిర్వహించిన పార్టీలో రాహుల్ గాంధీ కనిపించారు.చైనా అంబాసిడర్తో కలిసి పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న ఈ వీడియో వైరల్ అయింది.దీంతో నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.కష్టాల్లో ఉన్న పార్టీని వదిలేసి రాహుల్ గాంధీ.
నేపాల్లో పార్టీ చేసుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు.అయితే మయన్మార్లో నేపాల్ రాయబారిగా పని చేసిన భీమ్ ఉదాస్ తన కుమార్తె వివాహానికి రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఆ వివాహ వేడుకల్లో పాల్గొందుకే రాహుల్ గాంధీ నేపాల్ వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఉస్మానియా యూనివర్శిటీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు.వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు… పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు.
ఓయూలో రాహుల్ గాంధీ అడుగుపెడితే అడ్డుకుంటామని స్పష్టం చేశారు.తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన తర్వాతనే ఓయూలో రాహుల్ గాంధీ అడుగుపెట్టాలని టీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఉస్మానీయా యూనివర్సీటిలో విద్యార్థుల సంఘాలు రాహుల్ సభ అనుమతి నిరాకరణ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చేస్తున్నారు.ఎమ్మెల్యే జగ్గారెడ్డి తో పాటు విద్యార్థి సంఘాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ , కాంగ్రెస్ రాజకీయాలు కాక రేపుతున్నాయి.టీఆర్ఎస్ సర్కార్ పై మరింత దూకుడు పెంచిన కాంగ్రెస్ నేతలు తెలంగాణలో అధికారం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
గత రోజుల నుంచి కాంగ్రెస్ వర్గపోరు జరుగుతున్న అధికారం కోసం ఏకంమవుతున్నారు.టీఆర్ఎస్ ను ఎలాగైనా పడ్డగోట్టాలనే ఆలోచనలతో కీలక నేతలు ముందుకేళ్తున్నారు.