తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకున్న విషయం తెలిసిందే.ఈ మేరకు ఆఖరి రోజున కాంగ్రెస్ అగ్రనేతలు విస్తృతంగా పర్యటించి క్యాంపెయిన్ నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా రేపటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచార షెడ్యూల్ ఖరారైంది.రేపు ఉదయం 10.30 గంటలకు జూబ్లీహిల్స్ ఆటో వర్కర్స్ యూనియన్, జీహెచ్ఎంసీ, వర్కర్స్ యూనియన్లతో రాహుల్ గాంధీ ముఖాముఖీ నిర్వహించనున్నారు.తరువాత రేపు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నాంపల్లిలో రాహుల్ రోడ్ షోతో చేపట్టడంతో పాటు కార్నర్ మీటింగ్ లలో పాల్గొననున్నారు.మరోవైపు ప్రియాంక గాంధీ రేపు ఉదయం 11.30 గంటలకు జహీరాబాద్ లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.