హీరో సూర్య స్టార్ అవ్వడానికి కారణంరఘువరన్ చెప్పిన ఒకే ఒక్క మాట.. అదేంటో తెలుసా ?

సూర్య .ప్రస్తుతం కోలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ ఇండియా లోనే స్టార్ హీరోగా ఉన్నాడు.

కానీ కొన్నాళ్ల క్రితం పరిస్థితి మరోలా ఉండేది.వేరే హీరోలు వారి డేట్స్ అడ్జస్ట్ కాక వదిలేసిన సినిమాల్లో సూర్య నటించేవాడు.

సోలో హీరోగా సూర్య నటించిన మూడు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.దారుణమైన రివ్యూస్ రాసేవారు సూర్య పై.అసలు ఎక్స్ప్రెషన్స్ పలకడం లేదు అని, వుడెన్ ఫేస్ అని సూర్యని ఎగతాళి చేసేవారు.అప్పటివరకు కెరియర్ సీరియస్ గా తీసుకోలేదు సూర్య.

ఎందుకంటే కేవలం డబ్బు కోసం మాత్రమే సినిమాల్లో నటించాడు.డైరెక్టర్ వసంత్ ఒక రోజు షాప్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్న వ్యక్తిని పిలిచి 50 వేల రూపాయల చెక్కి చేతికి కి ఇచ్చి నువ్వే నా సినిమాలో హీరో అని చెప్పి వెళ్ళిపోతాడు.

Advertisement

ఆ సూపర్ వైజర్ మరెవరో కాదు మన సూర్య.ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉండటం తో షాప్ లో పనికి కుదిరాడు.

వసంత్ కి అతడు శివ కుమార్ కి కొడుకు అని ముందే తెలుసు.తండ్రి శివకుమార్ పెద్ద హీరోనే అయినప్పటికీ ఫేడ్ అవుట్ అయిపోవడంతో సీరియల్స్ లో కూడా నటించాడు.

శివకుమార్ అంటే వసంతకి ఎంతో అభిమానం అతని ద్వారా లబ్ధి పొందాడు కూడా.దాంతో అతని కొడుకుని హీరోగా చేయాలని వసంత్ అనుకున్నాడు.800 రూపాయల కోసం షాప్ లో పనిచేస్తున్న సూర్య ని పిలిచి హీరోగా అవకాశం ఇచ్చాడు.డబ్బులు వస్తున్నాయి కదా అని కొన్ని సినిమాల్లో నటించాడు సూర్య.

మన తెలుగు దర్శకురాలైన బి జయ కూడా అతనితో ఓ సినిమా తీస్తే అది కూడా ఫ్లాప్ అయింది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

ఇక సమయం ఇలా గడుస్తున్న టైం లో నటుడు రఘువరన్ సూర్యని చూసి మీ నాన్న హీరో కాబట్టి ఎన్నాళ్లు అతడి పేరు చెప్పుకొని సినిమాల్లో నటిస్తావు.నీకంటూ ఒక గుర్తింపు వద్ద ? నీలో ఒక గొప్ప నట్టు ఉన్నాడు.ఎవరో వదిలేసిన క్యారెక్టర్స్ ఎన్ని రోజులు చేస్తావు.

Advertisement

నువ్వు వదిలేసిన క్యారెక్టర్స్ మిగతా హీరోలు చేసేలా నువ్వు మారాలి అంటూ చెప్పి వెళ్లిపోయాడు.అతడు చెప్పిన మాటలు సూర్య లో ఒక కసిని రగిలించాయి.

పాత రివ్యూలన్నీ కూడా తీసి చూసాడు ఆరు నెలల పాటు తనలోని నటుడుకి మెరుగుపెట్టాడు.

ఎవరేం చెప్పినా ఏం మాట్లాడినా గమనిస్తూ ఉండడం అలవాటు చేసుకున్నాడు.దాంతో తన తదుపరి సినిమా దర్శకుడు బాలాతో తీశాడు.ఆ సినిమా మంచి హిట్ అయింది.అదే సినిమాకు తమిళనాడు స్టేట్ అవార్డు కూడా వచ్చింది.

ఇక ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన కాకా కాకా సినిమా కూడా మంచి హిట్ అయింది.ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్ ఘర్షణ పేరుతో తీశాడు.

ఇక ఆ తర్వాత పితాగమన్ అదే అండి తెలుగులో శివ పుత్రుడు.ఇది కూడా సూర్య కెరీర్ కి చాలా బాగా ఉపయోగపడింది.

ఆ తర్వాత వచ్చిన గజిని సినిమా సూర్య క్రేజ్ ని ఆకాశానికి తాకేలా చేసింది.ఇలా రఘువరన్ చెప్పిన ఒక్క మాట సూర్య జీవితాన్ని మార్చేసింది.

తాజా వార్తలు