ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి.అధికారంలో ఉన్న వైసీపీ మూడు రాజధానుల కాన్సెప్ట్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉండటంతో.
అమరావతిని సపోర్ట్ చేస్తున్న పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.మరోపక్క అమరావతి మహాపాదయాత్ర కొనసాగుతూ ఉంటుండగా… అనేక చోట్ల వైసీపీ శ్రేణులనుండి నిరసన వ్యక్తమౌతుంది.
పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధికారంలో ఉన్న వైసీపీ.
మూడు రాజధానులకు మద్దతుగా కొందరి చేత రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.ఆ తర్వాత ముక్కుమ్మడి రాజీనామాలు చేసి అసెంబ్లీ రద్దు వంటివి జరుగుతాయి.
దీంతో ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని రఘురామకృష్ణరాజు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఒక రఘురామకృష్ణ రాజు మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ కీలక నేతలు సైతం ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.