ఏపీ సీఎం జగన్ కి మరోసారి లెటర్ రాసిన రఘురామకృష్ణంరాజు..!!

గత కొన్ని రోజుల నుండి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ కి లెటర్ ల మీద లెటర్ లు రాస్తున్నారు.

వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇచ్చిన హామీలను అదే రీతిలో ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో అలసత్వం వహించే వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గత కొన్ని రోజుల నుండి లెటర్లు రాయటం తెలిసిందే.

వృద్ధుల పెన్షన్ పెంపు ఉద్యోగస్తుల క్యాలెండర్ ఇంకా అనేకమైన హామీల విషయంలో ప్రభుత్వాన్ని తన లెటర్ ల ద్వారా రఘురామకష్ణంరాజు ప్రశ్నించారు.ఇదిలా ఉంటే తాజాగా మరో లెటర్ రాస్తూ దానికి నవ ప్రభుత్వాల కర్తవ్యాల టైటిల్ పెట్టడం జరిగింది.

సందర్భంగా మహమ్మారి కరోనా కారణంగా దేశ ప్రధాని మోడీ పరీక్షల రద్దు పై నిర్ణయం తీసుకోవడం జరిగిందని లేఖలో స్పష్టం చేశారు.కరోనా బారిన పడకుండా పిల్లలను కాపాడటానికి ప్రధానమంత్రి  నిర్ణయం తీసుకోవటం జరిగిందని అదే రీతిలో దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా పరీక్షలు రద్దు చేసినట్లు ప్రకటించడం జరిగిందని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది.విద్యార్థులను ఎందుకు ఒత్తిడికి గురి చేస్తుంది.? పరీక్షల నిర్వహణ విషయంలో స్పష్టమైన సరైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.

Advertisement

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

తాజా వార్తలు