మూత్ర‌పిండాల్లో రాళ్లున్నాయా..ముల్లంగి ఆకుల‌తో నివారించుకోండిలా?

మూత్ర‌పిండాల్లో రాళ్లు.ఇటీవ‌ల కాలంలో చాలా మందిని వేధిస్తున్న‌ స‌మ‌స్య ఇది.కేవ‌లం పెద్ద వారిలోనే కాదు.

చిన్న పిల్ల‌ల్లో కూడా ఈ స‌మ‌స్య క‌నిపిస్తోంది.

మారిన జీవ‌న‌శైలి, అధికంగా టీలు.కాఫీలు తీసుకోవ‌డం, మాంసాహారం ఓవ‌ర్‌గా తీసుకోవ‌డం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, ఒకే చోటు కూర్చోవ‌డం, నీటిని స‌రిగ్గా తీసుకోక‌పోవ‌డం, పోష‌కాల లోపం, ఇలా ర‌క‌రకాల కార‌ణాల వ‌ల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయి.

ఇక మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్ప‌డితే.వారి బాధ వ‌ర్ణ‌ణాతీతం.

అందుకే మూత్ర పిండాల్లో ఎంత త్వ‌ర‌గా రాళ్లను క‌రిగించుకుంటే అంత మంచిద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే మూత్ర పిండాల్లో రాళ్ల‌ను క‌రిగించ‌డంతో కొన్ని ఆహారాలు ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.

Advertisement
Radish Leaves Helps To Reduce Kidney Stones! Radish Leaves, Benefits Of Radish L

అలాంటి వాటిలో ముల్లంగి ఆకులు ఒక‌టి.సాధార‌ణంగా చాలా మంది ముల్లంగి ఆకుల‌ను ప‌డేస్తుంటారు.

కానీ, ముల్లంగి ఆకుల్లో కూడా మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్‌, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

Radish Leaves Helps To Reduce Kidney Stones Radish Leaves, Benefits Of Radish L

అందుకే ముల్లంగి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా మూత్ర పిండాల్లో ఏర్ప‌డిన రాళ్ల‌ను క‌రిగించ‌డంతో ముల్లంగి ఆకులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.ముల్లంగి ఆకుల‌తో ర‌సాన్ని త‌యారు చేసుకుని.

ప్ర‌తి రోజు ఒక చిన్న క‌ప్పు చ‌ప్పున తీసుకోవాలి.ఇలా చేస్తే ముల్లంగి ఆకులో ఉండే విట‌మిన్ బి స‌హాజంగా మూత్ర పిండాల్లో రాళ్ల‌ను క‌రిగించేస్తుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఒక‌వేళ ముల్లంగి ఆకుల‌ను ర‌సం తాగ‌లేని వారు.సలాడ్స్ ముల్లంగి ఆకులు వేసి తీసుకోవాలి.

Advertisement

ముల్లండితో క‌లిపి ముల్లంగి ఆకుల‌ను వండుకుని తినొచ్చు.ఇలా ఎలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

పైగా ముల్లంగి ఆకులు తీసుకుంటే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.కీళ్ళవాపు, కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.

డ‌యాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది.‌.

తాజా వార్తలు