అనుమతి లేకుండా యూట్యూబ్ లో సినిమా...కేసు పెట్టిన మాజీ సీఎం భార్య

క‌ర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి సతీమణి రాధికా కుమారస్వామి ఒకప్పటి హీరోయిన్ అన్న విషయం తెలిసిందే.కుట్టి రాధికగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ అమ్మడు తెలుగు చిత్రం నందమూరి తారక్ పక్కన హీరోయిన్ గా కూడా నటించింది.

 Radhika Kumaraswamy Approach Cyber Police , Radhika Kumaraswamy's Sweety Nanna-TeluguStop.com

అనంతరం కన్నడ చిత్ర సీమలో కొన్ని సినిమాల్లో నటించి, ఆ సమయంలోనే ఆమె క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామిని ర‌హ‌స్య వివాహం చేసుకోవ‌డం అప్పట్లో పెద్ద సంచ‌ల‌న‌మైంది.ఆ తరువాత పెళ్లి చేసుకోవడం అలానే నటనకు స్వస్తి పలకడం జరిగిపోయాయి.

అయితే నటనకు అయితే స్వస్తి పలికింది కానీ సినీ ఇండస్ట్రీ ని మాత్రం వదిలిపెట్టలేదు.నిర్మాతగా మారి కొన్ని చిత్రాలను నిర్మించింది కూడా.

దాంతో పాటు అడపా దడపా ప్రధాన పాత్రలో కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది.అయితే ఆమె నిర్మించిన ఒక చిత్రం ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా యూ ట్యూబ్ లో అప్ లోడ్ కావడం తో ఆమె ఒక్కసారిగా ఖంగుతింది.వెంటనే ఆ ఛానల్ పై లీగల్ గా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.2013లో రాధిక కుమారస్వామి ‘స్వీటీ నాన్న జోడి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రం థియేటర్‌లో విడులైంది.ఐతే.ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి.కానీ డిజిటల్ హక్కులు మాత్రం రాధిక కుమార స్వామి దగ్గరే ఉన్నాయట.అయితే రూ.3 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ చిత్రాన్నిఏమాత్రం ఆమె అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం తో ఇప్పుడు ఆ విషయం గుర్తించిన ఆమె చీటింగ్ కేసు నమోదు చేసింది.ఈ విషయమై ఆమె బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube