టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన స్పీడును చూపిస్తున్నాడు.ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలు రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
అయితే ఈ సినిమాల్లో ప్రభాస్ విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు.ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉందని చిత్ర యూనిట్ పలుమార్లు చెప్పుకొచ్చింది.
అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ ఇప్పట్లో ఉంటుందో లేదో అనే సందేహం నెలకొనగా, ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాకు సంబంధించి కొన్ని షాట్స్‌ను చిత్ర యూనిట్ కొత్త లోకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారట.అయితే ఈ షూటింగ్‌లో నటీనటులు ఎవరూ పాల్గొనడం లేదని, కేవలం లొకేషన్స్ కోసమే ఈ సినిమా రీషూట్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నారు.
ఇక వింటేజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా, ఇందులో ప్రభాస్ లుక్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే అంశం ఇంకా తెలియాల్సి ఉంది.ఏదేమైనా రాధేశ్యామ్ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.మరి రాధేశ్యామ్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.