కోలీవుడ్ స్టార్ హీరోల్లో విశాల్( Vishal ) ఒకరు.స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విశాల్ తెలుగువాడైన కూడా కోలీవుడ్ లో హీరోగా రాణిస్తూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఇటు టాలీవుడ్ లో కూడా విశాల్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే చెప్పాలి.ఎందుకంటే ఈయన సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలు సాధిస్తుంటాయి.
వరస హిట్స్ తో కేరీర్ లో జెట్ స్పీడ్ గా దూసుకు పోయిన విశాల్ కు ఈ మధ్య సరైన హిట్ పడడం లేదు.ఇటీవలే ఈ యాక్షన్ హీరో నటించిన ”లాఠీ”( Lathi ) సినిమాతో అయిన హిట్ కొట్టాలని బలంగా అనుకున్నాడు.
కానీ ఇది కూడా ఈయన కెరీర్ లో మరో ప్లాప్ గా మిగిలి పోయింది.ప్రజెంట్ విశాల్ తన 34వ సినిమాను డైరెక్టర్ హరితో ప్రకటించాడు.
ఇప్పటికే వీరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు కూడా సాలిడ్ హిట్స్ గా నిలిచాయి.ఇక హ్యాట్రిక్ సినిమాను చేస్తున్నారు.ఇదిలా ఉండగా విశాల్ మరో సినిమాకు కమిట్ అయినట్టు తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.అది కూడా ప్రభాస్ డైరెక్టర్ తో అని తెలుస్తుంది.ఈ యాక్షన్ హీరో రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో( Directed by Radhakrishna ) ఒక సినిమా చేయబోతున్నాడట.
ఇప్పటికే విశాల్ కు కథ వినిపించడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని రూమర్స్ వస్తున్నాయి.మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ యూవీ క్రియేషన్స్ నే వీరి కాంబోను కలిపినట్టు టాక్.యూవీ ఎప్పటి నుండో విశాల్ తో సినిమా చేయాలని అనుకుంటుంది.
మరి ఆ సినిమాకు డైరెక్టర్ గా రాధాకృష్ణ కుమార్ ను ఫిక్స్ చేసినట్టు టాక్.మొన్నటి వరకు రాధాకృష్ణ శివ కార్తికేయన్ తో సినిమా చేస్తాడని రూమర్స్ రాగా ఇప్పుడు విశాల్ పేరు వినిపిస్తుంది.