వీర్రాజు జోకులు.. అభివృద్ధి ఎక్కడంటూ ప్రశ్నలు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లెక్కలు భలే విచిత్రంగా ఉంటాయి.ఏపీలో ఏ అభివృద్ధి పని జరిగినా అది కేంద్రం దయతోనే జరిగిందని సోము వీర్రాజు అభిప్రాయపడుతూ ఉంటారు.

 Questions To Somu Veerraju To Show Where The Development Took Place , Andhra Pradesh, Bjp, Somu Veerraju, Central Government,ysrcp, Tdp,minister Botsa Satyanarayana-TeluguStop.com

కానీ విభజన సమయంలో ఏపీకి రావాల్సిన వాటి విషయాలను మాత్రం అస్సలు పట్టించుకోరు.ఇప్పటికే టీడీపీ హయాంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి టీడీపీని ఎన్డీయేకు దూరం చేయడంలో సోము వీర్రాజు కీలక పాత్ర పోషించారనే టాక్ ఉంది.

ఇప్పుడు కూడా సోము వీర్రాజు వల్ల ఏపీలో బీజేపీకి జరుగుతున్న లాభమేమీ కనిపించడం లేదని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.ఏపీలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని.కేంద్రం ఏపీపై ఫుల్ ఫోకస్ పెట్టిందంటూ ఊకదంపుడు మాటలను సోము వీర్రాజు చెప్తున్నారు.దీంతో ఆయన వ్యాఖ్యలను జోకులుగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు.

 Questions To Somu Veerraju To Show Where The Development Took Place , Andhra Pradesh, Bjp, Somu Veerraju, Central Government,ysrcp, TDP,Minister Botsa Satyanarayana-వీర్రాజు జోకులు.. అభివృద్ధి ఎక్కడంటూ ప్రశ్నలు-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పైగా సోము వీర్రాజు లేటెస్టుగా వైసీపీ ప్రభుత్వానికి ఓ ఛాలెంజ్ కూడా విసిరారు.కేంద్ర ప్రభుత్వం వల్లే ఏపీలో అభివృద్ధి జరుగుతుందనే అంశంపై డిబేట్‌కు రావాలని మంత్రి బొత్సను సవాల్ చేశారు.

ఏపీలో రోడ్లను కేంద్ర ప్రభుత్వమే వేయిస్తుందని.ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ ప్రకటించిందని.పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కేంద్రం ఉచితంగా సరఫరా చేస్తుందంటూ సోము వీర్రాజు వివరిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన రోడ్లను వేయిస్తే వైసీపీ నేతలు దిల్ ఖుష్‌గా వాటిపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.అటు రేషన్ బియ్యంలో ఏపీ రూ.2 పెడితే.కేంద్రం వాటా రూ.30 అని.అలాంటప్పుడు రేషన్ పంపిణీ వాహనాలపై జగన్ ఫొటో ఎలా పెట్టుకుంటారని సోము వీర్రాజు ప్రశ్నిస్తున్నారు.

అటు కరోనా సమయంలో మోదీ ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని సోము వీర్రాజు ప్రశంసల వర్షం కురిపించారు.మంత్రి బొత్స సొంత జిల్లాలోని రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం శిరస్సు ఖండిస్తే దానిపై పోరాడి నూతన విగ్రహాన్ని ప్రతిష్టింప చేసిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు.అయితే సోము వీర్రాజు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

అటు అభివృద్ధి అని పదే పదే జపం చేస్తున్న వీర్రాజును రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని టీడీపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube