గోల్డ్ మెడలే టార్గెట్ గా దూసుకెళ్తున్న పివి సింధు...!

ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి ఒలింపిక్స్ క్రీడలు.చాలామంది వీటిలో పతకాలు సాధించాలని ఎంతో శ్రమిస్తుంటారు.

ఇందులో ఏ పతకమైన సాధిస్తే చాలు.ఇకవారు అద్భుతమైన జీవితాన్ని పొందినట్టే అవుతుంది.

ప్రపంచ దేశాలన్నీ ఈ ఒలంపిక్స్ గేమ్స్ కోసం బరిలోకి దిగుతుంటాయి.తమ దేశంలో క్రీడాకారులు ఎవరైనా ఒలంపిక్స్ లో పతకం సాధిస్తే ఇక దేశం మొత్తం వారికి బంపరాఫర్లు ప్రకటిస్తారు.

నగదు బహుమతులు ఇస్తారు.ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు.

Advertisement

తాజాగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌ గేమ్స్ లో భారతదేశానికి చెందినటువంటి పీవీ సింధు దూకుడుగా ఆడుతున్నారు.పీవీ సింధు ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.

మహిళల సింగిల్స్ గ్రూప్ J లో పీవీ సింధుకు విజయం వరించింది.

వరుసగా రెండు సార్లు గెలవడంతో ఆమె గ్రూప్ లో మొదటి స్థానంలో ఉంది.దీంతో పీసీ సింధు ప్రీక్వార్టర్ లోకి అడుగు పెట్టింది.ఇప్పుడు తాజాగా క్వార్టర్స్ కు సింధు చేరింది.ప్రీక్వార్టర్ లో డెన్మార్క్ క్రీడాకారిణి బ్లిక్ ఫెల్ట్ పై పీవీ సింధు విజయం సాధించింది.21-15, 21-13 తేడాతో బ్లిక్ ఫెల్ట్ ను పీవీ సిందు ఓటమిపాలు చేసింది.మూడుసార్లు గెలుపు సాధించడంతో గ్రూప్ - J లో పీవీ సింధు మొదటి స్థానంలో కొనసాగుతోంది.

ప్రీక్వార్టర్ లో డెన్మార్క్ కు చెందిన 12వ ర్యాంకర్ మియా బ్లిక్ ఫెల్ట్ తో పీవీ సింధు తలపడుతోంది.ఆమె సింధు ఇప్పటికే 5 సార్లు పోటీ పడింది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

అందులో నాలిగింటిలో సింధు విజయం సాధించింది.ఒక మ్యాచ్ లో మాత్రం బ్లిక్ ఫెల్ట్ విజయం సాధించింది.

Advertisement

ఈ సంవత్సరం మొదటిలో థాయ్ లాండ్ ఓపెన్ లో సింధుపై బ్లిక్ ఫెల్ట్ విజయం సాధించారు.ప్రస్తుతం పీవీ సింధు దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు.

బంగారం పతకం సాధించడానికి సింధు అహర్శశలు కష్టపడుతోంది.

తాజా వార్తలు