అల్లు అర్జున్( Allu Arjun ) సుకుమార్( Sukumar ) కాంబినేషన్ లో పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప2 తెరకెక్కుతుండగా ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి.పుష్ప2( Pushpa 2 movie ) నుంచి కొన్నిరోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఫస్ట్ పార్ట్ తో పోల్చి చూస్తే సెకండ్ పార్ట్ లో శ్రీవల్లి ( Srivalli )పాత్రకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందని గ్తంలో వార్తలు వైరల్ అయ్యాయి.అయితే పుష్ప2 మూవీలో శ్రీవల్లి చనిపోయిందంటూ ఫోటో వైరల్ అవుతోంది.

ఈ ఫోటోను చూసిన నెటిజన్లు పుష్ప2 మూవీలో శ్రీవల్లి చనిపోవడమే ట్విస్ట్ అని ప్రచారం చేస్తున్నారు.అయితే విచిత్రం ఏంటంటే వైరల్ అయిన ఫోటోలో ఉన్న హీరోయిన్ అసలు రష్మిక కాదు( Rashmika ).ఆ ఫోటో అసలు పుష్ప2 సినిమాకు సంబంధించిన ఫోటో కాదు.గతంలోనే ఈ ఫోటోకు సంబంధించి మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చినా మళ్లీ ఈ ఫోటో వైరల్ అవుతోంది.
ఒక సినిమాలోని షాట్ లో హీరోయిన్ అచ్చం శ్రీవల్లి పాత్రను పోలి ఉండటంతో ఈ వార్త వైరల్ అయింది.ఈ ఫోటో మరాఠీ మూవీకి సంబంధించిన ఫోటో కావడం గమనార్హం.

మరోవైపు పుష్ప2 మూవీ మామూలుగా ఉండదని కామెంట్లు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎన్ని అంచనాలు పెట్టుకుని చూసినా సినిమా నిరాశపరచదని కేజీఎఫ్2 సినిమాను మించేలా ఈ సినిమాను ప్లాన్ చేశారని తెలుస్తోంది.పుష్ప2 మూవీలో ఇతర పాత్రలకు కూడా ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుందని సమాచారం.పుష్ప2 మూవీ ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
మైత్రీ నిర్మాతలకు ఈ సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత ఎన్నో లాభాలను అందిస్తోంది.మైత్రీ నిర్మాతలు నిర్మించిన భారీ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.పుష్ప2 సినిమా రిలీజ్ డేట్ ను మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారని తెలుస్తోంది.