పుష్ప సీన్ కాపీనా.. వేణు మాధవ్ ఐదేళ్ల క్రితమే ఆ మాట అన్నారా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప.

ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ సినిమా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.ఈ సినిమాతో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు దక్కింది.

ఇక ఈ సినిమాలోని పాటలు డైలాగులు అయితే సోషల్ మీడియాలో రికార్డులను సృష్టించాయి.ఇది ఇలా ఉంటే పుష్ప సినిమాలోని ఒక ఇన్సిడెంట్ గతంలో కమెడియన్ వేణుమాధవ్ చేసిన దానిని కాపీ కొట్టారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.ఈ సినిమాలో అల్లుఅర్జున్ ఓనర్ ఎదురుగా వస్తున్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఉన్నప్పుడు అలా ఎందుకు వేసుకున్నావు అని ఒక వ్యక్తి అడిగినప్పుడు నా కాలు మీద నా కాలు వేసుకుంటే తప్పు ఏమిటి అని చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది.

Advertisement

ఈ సన్నివేశం పై దర్శకుడు సుకుమార్ స్పందిస్తూ తన సోదరుడు కూడా ఒకసారి ఇదే తరహాలో ప్రవర్తించాడని అందుకే ఇది సినిమాలో పెట్టడం జరిగింది అన్నట్టుగా తెలిపాడు.సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.

ఇదే డైలాగ్ ను కమెడియన్ వేణుమాధవ్ ఐదేళ్ల కిందటే చెప్పాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.ఒక ఇంటర్వ్యూలో వేణుమాధవ్ ఈ రోజు స్టార్ హీరో తో ఎదురైన అనుభవం గురించి తెలిపాడు.

అందులో ఏమయ్యా నువ్వు ఎవరు వచ్చినా కూడా కాలు మీద కాలు వేసుకుని ఉంటావ్ అంట కదా అని అడగగా.

అప్పుడు మీకు ఏ నా కొడుకు చెప్పారు అని వేణుమాధవ్ ప్రశ్నించాడట.అప్పుడు వెంటనే సదరు హీరో ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేసి.అప్పుడు వేణుమాధవ్ మీతో ఏం చెప్పాడో కరెక్ట్ గా చెప్పండి అని అడిగినప్పుడు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

కాలు మీద కాలు వేసుకుంటావ్ అని తనతో అన్నారు అని సదరు హీరో ఆన్సర్ ఇచ్చాడట.అప్పుడు వేణుమాధవ్ నా కాలు మీద కాలు వేసుకుంటే తప్పేంటి అని సమాధానం ఇవ్వడంతో సదరు హీరో సైలెంట్ గా ఫోన్ లో ఉండిపోయాడట.

Advertisement

ఇక అదే తరహాలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో చెప్పించడం వైరల్ గా మారుతుంది.

తాజా వార్తలు