ఏడాది పూర్తి చేసుకున్న పుష్ప.. ఇలా అయితే కష్టమే!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తాజా చిత్రం ‘పుష్ప’ను ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ‘పుష్ప’ ఎప్పుడు పూర్తవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బన్నీ పూర్తి మాస్ లుక్‌లో కనిపించనున్నాడు.అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసి ఏడాది పూర్తవుతుంది.

Pushpa Movie Must Speed Up, Allu Arjun, Pushpa, Sukumar, Rashmika Mandanna, Toll

కానీ ఇప్పటివరకు సగం కూడా షూటింగ్ జరుపుకోకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.అన్నీ అనుకున్నట్లు జరిగితే పుష్ప చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యేదని, సినిమాను రిలీజ్ కూడా చేసే వారని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమా మరింత ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

Advertisement

కాగా ఈ సినిమా కథ ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించే క్రమంలో చిత్ర యూనిట్ లొకేషన్ల కోసం చాలా కష్టపడుతున్నారు.ఇప్పటికే కేరళ, ఏపీ అడవుల్లో ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకోవాలని చూసిన చిత్ర యూనిట్, తాజాగా విశాఖపట్నంలో కొంతమేర షూటింగ్ నిర్వహించేందుకు రెడీ అవుతోంది.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఎలాంటి గ్యాప్ లేకుండా పూర్తి చేయాలని సుకుమార్ అండ్ టీమ్ నిర్ణయించుకుంది.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!
Advertisement

తాజా వార్తలు