అల్లు అర్జున్,( Allu Arjun ) సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు.వీరి కాంబోలో వచ్చిన పుష్ప సినిమా దాదాపుగా రూ.
400 కోట్ల వసూళ్లు రాబట్టింది.అందుకే పుష్ప 2 ను వెయ్యి కోట్ల టార్గెట్ గా ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ను హిందీ తో పాటు ఇతర భాషల్లో విడుదల చేయబోతున్నారు.విదేశీ భాష ల్లో కూడా ఈ సినిమా ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
ఓ హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.ఇలాంటి సమయంలో పుష్ప 2 సినిమా విడుదల తేదీ విషయం లో మేకర్స్ ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు.షూటింగ్ ఇంకా పెండ్డింగ్ ఉన్న కారణంగా ఈ ఏడాది సినిమా ను విడుదల చేయడం సాధ్యం అయ్యే పరిస్థితి లేదు.
వచ్చే ఏడాది సంక్రాంతికి అని మొదట అనుకున్నారు.కానీ ఆర్‌ఆర్‌ఆర్ ( RRR movie )హీరో అల్లూరి అలియాస్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కాబోతుంది.
గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer ) విడుదల వల్ల సంక్రాంతికి పుష్ప 2 సినిమాను విడుదల చేయడం సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.ఇక సమ్మర్ లో అయినా ఈ సినిమా ను విడుదల చేయాలి అనుకుంటే అదే ఆర్ఆర్ఆర్ స్టార్ కొమురం భీమ్ అలియాస్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా( Devara Movie ) ఏప్రిల్ లో రాబోతుంది.దాంతో ఏప్రిల్ నెలలో సినిమా ను విడుదల చేయడం సాధ్యం కాదని తేలిపోయింది.
ఇలాంటి సమయంలో సినిమాను మే లో లేదా జూన్ లో అయినా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ ల వల్ల పుష్ప 2 సినిమా రిలీజ్ ప్లాన్స్ ను మార్చినట్లుగా టాక్ వినిపిస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy