టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ( Allu arjun )హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2.ఇందులో రష్మిక మందన ( Rashmika Mandanna )హీరోయిన్ గా నటించగా అనసూయ,( Anasuya ) సునీల్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి అయింది.వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే 2021లో విడుదలైన పుష్ప 1 మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

దీంతో పార్ట్ 2పై భారీగా అంచనాలు ఉన్నాయి.నీకు తోడు అల్లు అర్జున్( Allu arjun ) పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేయగా, అందులో అల్లు అర్జున్ సగం ఆడా సగం మగా గెటప్ లో ఉండడంతో ఈ సినిమాపై అంచనాలను మరింత పెరిగాయి.పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.అంతా బాగానే ఉంది కానీ పుష్ప-2 మేకర్స్‌కి ఐటం సాంగ్ తలనొప్పులు తెచ్చిపెడుతోందట.ఇక పుష్ప పార్ట్1 లో సమంత( Samantha ) చేసిన ఐటమ్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.అందుకు తగ్గట్టుగానే పార్ట్ 2 లో ఐటమ్ సాంగ్ ని చిత్రీకరించాలి అని చూస్తున్నారు డైరెక్టర్ సుకుమార్.

ఒక స్టార్ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ చేయించాలని అనుకుంటున్నా సుకుమార్ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నదానిపై సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే పలువురు బాలీవుడ్ బ్యూటీలను సంప్రదించగా వారు కూడా నో చెప్పినట్టు తెలుస్తోంది.సుకుమార్ సినిమాలలో ఐటెం సాంగ్ లు ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికీ తెలిసిందే.అలాగే ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా మిగిలిన పాటలన్నీ ఒక ఎత్తు అయితే ఐటమ్ సాంగ్ ( Item song )మరొక ఎత్తు అన్నట్టు క్రియేట్ చేశారట సుకుమార్.
మరి ఐటమ్ సాంగ్ కి సుకుమార్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు.అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులు వేయబోయే ఆ హీరోయిన్ ఎవరో తెలియాలి అంటే మరికొద్ది రోజులు చూడాల్సిందే మరి.