ఇది పల్లీ ఛాలెంజ్.. ముక్కుతో అంతదూరం తీసుకెళ్లాలి అప్పుడే..!

కొన్ని వింత ఆచారాలు ఉంటాయి.కొన్ని ఆలయాల వద్ద ఆచారాలు కొందరికి వింతగా అనిపిస్తాయి.

 Pushing A Peanut Challenge Started By A Young Man For A Purpose , Palli Challeng-TeluguStop.com

అక్కడి భక్తులు పాటించే సాంప్రదాయులు కొత్తగా చూసే వారికి కొత్తగా, వింతగా, ఇదేంటీ అనే తరహాలో మనకు అనిపిస్తూ ఉంటుంది.మన దేశంలోని పలు ఆలయాల్లో ఇలాంటి వింత ఆచారాలు గమనించే ఉంటారు చాలా మంది.

మోకాళ్లతో మెట్లు ఎక్కడం, పొర్లు దండాలు పెట్టడం, మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ పెట్టుకుంటూ వెళ్లడం చూసే ఉంటాం.కొందరు మెట్లపై హారతి కర్పూరాలు వెలిగిస్తూ ఉంటారు.

ఇవి కొత్తగా చూసే వారికి వింతగా అనిపించినా… భక్తులకు అవి సాధారణ ఆచారాలలాగే కనిపిస్తాయి.

ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అచ్చంగా అలాంటిదే.

అయితే ఇది జరిగింది మన దేశంలో కాదు.అమెరికాలో.

కొలరాడో ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఇదెక్కడి మొక్కురా నాయనా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని ఉందా.అయితే ఇది చదివేయండి.

అతని పేరు బాబ్ సలేం.ఆయన వయస్సు 53 ఏళ్లు.కొలరాడోలో ఉంటున్న ఆయన.పైక్స్ కొండపైకి పల్లీని తీసుకువెళ్తున్నాడు.అది కూడా పూర్తిగా ముక్కును ఉపయోగించి.ముక్కుకి టేపుతో కర్ర లాంటిది సెట్ చేసుకున్నాడు.దానితో పల్లీని పైక్స్ కొండపైకి నెడుతూ తీసుకెళ్తున్నాడు.ఆ కొండపైకి వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి.

బల్లిలా నేలపై పాకుతూ పల్లీని ముందుకు తీసుకెళ్తున్నాడు.జులై 9, 2022 న ఈ పనిని ప్రారంభించాడు.

ఇప్పటి వరకు దాదాపు 20 కిలోమీటర్లు వెళ్లాడు.సిటీ మానిటౌ స్ప్రింగ్స్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పని చేస్తున్నాడట బాబ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube