సినిమా ఇండస్ట్రీ అంటే మనకు గుర్తుకు వచ్చేది పెద్ద హీరోలు మాత్రమే కానీ ఇక్కడ చాలా మంది చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ కూడా ఇండస్ట్రీ ని నమ్ముకొని బతుకుతు ఉంటారు.అందుకే వీలైనన్ని ఎక్కువ సినిమాలు సెట్స్ మీదకి వెళ్తే చాలా మంది కుటుంబాలు బతుకుతాయి అందుకే కొంత మంది డైరెక్టర్లు అసలు లేట్ చేయకుండ సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ లో ఉన్న చిన్న చిన్న కార్మికులకు కూడా ఎప్పుడు పని ఉండేలా చూస్తారు ఒకప్పుడు దాసరి నారాయణ రావు ( Dasari Narayana Rao )గారు అలా వాళ్ల గురించి ఆలోచించే ఆయన చాలా తొందరగా సినిమాలు తీస్తూ ఉండేవారు ఒక్కోసారి అయితే ఒకే టైం లో ఆయన చేసే రెండు, మూడు సినిమాలు కూడా సెట్స్ మీద ఉండేవి అందుకే ఆయన కెరియర్ లో 150 సినిమాలు తీసిన డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు… ఇక ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ ఒక్కడే చాలా తొందరగా సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ లో ఉన్న అందరికీ పని కల్పించే విధంగా ప్లానింగ్ ప్రకారం సినిమాలు చేస్తున్నాడు….

పూరి జగన్నాథ్ వరుసగా సినిమాలు చేస్తూ ఒకప్పుడు ఫుల్ బిజీ గా ఉండేవాడు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా చాలా వరకు ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకునే విధంగా ఉండేవి…అయితే ఈ మధ్య ఆయన కి ప్లాప్ లు రావడం తో ఆయన కూడా కొంచం స్లో గానే సినిమాలు చేస్తున్నాడు.అయితే ఈ జనరేషన్ లో ఉన్న డైరెక్టర్ లలో చాలా ఎక్కువ సినిమాలు తీసిన డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ( Puri jagannadh )ఒక్కడే టాప్ పొజిషన్ లో ఉన్నాడు అనే చెప్పాలి.

ఇప్పటికే ఈయన ఒక 30 సినిమాల వరకు డైరెక్షన్ చేశాడు ఇక మిగితా టాప్ డైరెక్టర్లు అందరూ కూడా 10, 15 సినిమా దగ్గరే ఉన్నారు అందుకే పూరి ని డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్ అని పిలుస్తారు ఎందుకంటే ఆయన చేసే సినిమాల స్పీడ్ అలా ఉంటుంది…ఆయనకి నీరసంగా ఉండటం, స్లో గా ఉండటం అంటే నచ్చదు ఏదైనా ఫటా ఫట్ అయిపోవాలి అంతే… అందుకే ఆయన అంత ఎక్కువ సినిమాలకి డైరెక్షన్ చేశాడు…ప్రస్తుతం రామ్ హీరో గా డబల్ ఇష్మార్ట్( Double iSmart ) అని ఇష్మార్ట్ శంకర్ సినిమా కి సీక్వెల్ గా ఒక సినిమా తీస్తున్నాడు.ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీ లో మరోసారి తన మార్క్ ఏంటో చూపించబోతున్నాడు…








