Puri Jagannadh : అందుకే నా సినిమాలో హీరోలు ఎక్కువగా అనాథలు ఉంటారు : పూరి జగన్నాధ్

చాలా మంది పూరి జగన్నాథ్( Puri Jagannadh ) ని ఆయన సినిమాలతో పాటే ఆయన మాటలను కూడా ఇష్టపడుతుంటారు.ఆయన మాట్లాడే ప్రతి మాటలో ప్రపంచాన్ని చదివేసిన జ్ఞానం కనిపిస్తుంది.

 Puri Jagannadh Movies Heros Or Heroines-TeluguStop.com

అలాగే అతడు చెప్పే అతడు తీసే సినిమాల్లో కూడా ఒక విషయం అంతర్లీనంగా ట్రావెల్ అవుతూనే ఉంది.మొదటి సినిమా నుంచి డబల్ ఇస్మార్ట్ సినిమా వరకు దాదాపు 90% సినిమాల్లో ఒక కామన్ విషయం ఉంది.

అదేంటంటే హీరో లేదా హీరోయిన్ అనాధలు లేదంటే తల్లి చనిపోయిన హీరో, తండ్రి వదిలేసిన హీరో ఉంటారు.అంటే ఒక బ్రోకెన్ ఫ్యామిలీకి చెందిన మెయిన్ లీడ్ సినిమాలో ఖచ్చితంగా ఉంటుంది.

ఉదాహరణకు టెంపర్ సినిమా( Temper )లో జూనియర్ ఎన్టీఆర్ అనాధ అని చెప్పాడు.అలాగే అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో తండ్రి వదిలేసిన కొడుకుగా రవితేజ పెరుగుతాడు.

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది.ఇలా దాదాపు అన్ని చిత్రాల్లో కూడా హీరో లేదా హీరోయిన్ కి కుటుంబ సంబంధం పరంగా ఏదో ఒక ఇబ్బంది ఉండడం అనేది కామన్ పాయింట్ గా ఉంటుంది.

Telugu Ammananna, Jr Ntr, Puri Jagannadh, Ravi Teja, Sukumar, Temper-Movie

ఈ విషయంపై సుకుమార్( Sukumar ) తో చిట్ చాట్ సందర్భంగా పూరి జగన్నాథ్ క్లారిటీ ఇచ్చాడు.తనకు సంబంధించినంత వరకు అన్ని సవ్యంగా ఉన్న కుటుంబంలో నుంచి వచ్చే పిల్లలకు ఏ విషయాలు సరిగా తెలిసే అవకాశం ఉండదని, తల్లిదండ్రులు సంపాదించి పెడితే వాళ్లు తిని ఎలా సంపాదించాలో మర్చిపోతారు అని, కానీ తండ్రి చనిపోయిన ఒక పిల్లాడు ఎలా బ్రతకాలో నేర్చుకుంటాడు అని, తల్లి చనిపోయిన ఇంట్లో కూడా ఇలా జీవించాలి అనే విషయం తెలుస్తుందని, అలాంటి ఇళ్లల్లోని పిల్లలు చాలా స్ట్రాంగ్ అనే విషయాన్ని తన సినిమాల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తానని చెబుతున్నాడు పూరి జగన్నాథ్.మనం వేటాడితే పిల్లలకు తిండి పెడతాం కానీ వారికి వేట నేర్పము అందువల్లే చాలామంది గొప్పవాళ్ళ పిల్లలు పనికి రాకుండా పోతారు.

Telugu Ammananna, Jr Ntr, Puri Jagannadh, Ravi Teja, Sukumar, Temper-Movie

కానీ ఒక స్ట్రగుల్ చూసిన పిల్లవాడు ఎలా బ్రతకాలో తెలుసుకుంటాడు.వాడిని అడవిలో వదిలేసిన కూడా బ్రతికి ఇంటికి వస్తాడు.అలాగే నా సినిమాలో క్యారెక్టర్స్ కి కూడా అలాంటి ఒక స్ట్రగుల్ ఉంటుంది.

ఆ స్ట్రగుల్ లో నుంచి హీరోయిజం పుడుతుంది.ఆ సినిమాలు బాగా నడుస్తాయి అని నేను నమ్ముతాను అంటూ పూరి జగన్నాథ్ చెబుతున్నాడు.

ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తమ నిజ జీవితంలో అప్లై చేసుకోవాలని ఎవరో సంపాదించి పెడితే తిని కూర్చోవద్దని తమ సంపాదనతో పది మందిని సాకితే ఆ తృప్తి వేరేలా ఉంటుందంటూ పూరి జగన్నాథ్ చెబుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube