చిన్నమ్మ ముందున్న ఆప్షన్స్ ఏమిటి?

నిజానికి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్ష పదవి అంటే ఒక క్యాబినెట్ ర్యాంకు కన్నా ఎక్కువ పదవి కింద చూస్తారు .ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో( Congress party ) రాష్ట్ర అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రితో సమానంగా స్థానం ఉంటుంది.

 Purandeswari Can Reconstuct The Party In Ap , Congress Party, Purandeswari, Bjp-TeluguStop.com

రాష్ట్రంలో ఉన్న కీలక పరిస్థితులు అధ్యయనం చేసి వ్యూహ రచన చేసి , పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి అధికారం వైపుగా పార్టీని నడిపించాల్సిన బృహత్తర బాధ్యత అది.అయితే ఆంధ్రప్రదేశ్లో బాజాపా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత పదవి పొందిన మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి( Purandeshwari ) పరిస్థితి మాత్రం సైన్యం లేని మహారాణిలా ఉందట.చెప్పుకోదగ్గ కార్యకర్తల బలం కానీ కీలక నాయకులు కానీ లేకుండా భాజాపాను అభివృద్ధి చేయటం ఎలా అన్నది ఇప్పుడు ఆమె ముందున్న ప్రధాన ప్రశ్న.

Telugu Congress, Purandeswari-Telugu Political News

గత బీజేపీ ( BJP )నాయకులు చేసిన తప్పిదాలే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఎదుర్కొంటున్న పరిస్థితి కారణమనీ చెప్పవచ్చు .తమ వ్యక్తిగత ఎదుగుదల కోసం పార్టీ కాడర్ ను నిర్వీర్యం చేసుకున్న గత బాజాపా నాయకుల నిర్వాకం వల్ల పార్టీకి నిజాయితీగా పని చేసే కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు బిజెపిని నమ్ముకుంటే దక్కేదేమీ లేదన్న నిరాశ నిస్పృహలతో వేరువేరు పార్టీలలో సర్దుకుపోయారు.దాంతో క్షేత్రస్థాయిలో సరైన బలం లేక పార్టీ నామమాత్రంగా మిగిలిపోయింది.

నోట తో పోటీ పడే ఆ పార్టీ పోటీ చేసిన చోట కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోతుంది .

Telugu Congress, Purandeswari-Telugu Political News

ఇప్పుడు అధ్యక్ష పదవి చేపట్టిన చిన్నమ్మ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నట్లుగా కనిపిస్తుంది ఒకటి మిత్రపక్షమైన జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని అధికార పార్టీపై అలుపెరగని పోరాటం చేస్తే రాష్ట్రంలో కొంత ఓట్ బ్యాంకు ని సొంతంగా నిలబెట్టుకునే అవకాశం రెండు పూర్తిస్థాయిలో పార్టీ ప్రక్షాళన చేసి క్షేత్రస్థాయి నుంచి తిరిగి పార్టీని పునర్నిర్మించడం .ఇది చాలా సుదుర్గమైన రాజకీయ ప్రయాణంగా చెప్పవచ్చు.దీనికి కొన్ని సంవత్సరాలు టైం కూడా పడుతుంది.

ఒకటి రెండు ఎన్నికల సమయం కూడా పడుతుంది .పార్టీలను పునర్ నిర్మించడం కన్నా ఇతర పార్టీలను కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకునే నయాపాలిటిక్స్ ను వంట పట్టించుకున్న బిజెపి నాయకత్వానికి ఈ పద్ధతిఅంతగా రుచించకపోవచ్చు.దాంతో అధికారంలో వాటా కోరడం ద్వారా తమ రాజకీయపబ్బాన్ని గడుపుకునే రెండో పద్ధతికే భాజాపా అధిష్టానం ఇష్టపడవచ్చు .మరి గత నాయకులు లాగే నామమాత్రపు అధ్యక్షురాలుగా బండి లాగిస్తారు లేదా తనదైన మార్క్ చూపించడానికి ముందుకు వస్తారో మరి కొద్ది రోజుల్లో ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube