ఇరాన్‎లో నిరసన జ్వాలలు

ఇరాన్‎లో నిరసన జ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయి.హిజాబ్ లు తగలబెడుతూ రోడ్లపై నిరసనలు చేస్తున్నారు.

 Protests Flare Up In Iran-TeluguStop.com

ఇటీవల ఇరాన్ మొరాలిటీ పోలీసుల చేతిలో మహసా అమినీ అనే యువతి మరణం దేశంలో ఆగ్రహ జ్వాలలను రగిలించింది.ఇస్లామిక్ రిపబ్లిక్ విధించే డ్రెస్ కోడ్ ను, దాన్ని అమలు చేస్తున్న వారికి వ్యతిరేకంగా మహిళలు తలకు కట్టుకునే హిజాబ్ లను తగులబెట్టి మొత్తం 15 నగరాల్లో ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

మహసా అమీనీ ధరించిన హిజాబ్ కింద నుంచి జుట్టు కొంచం కనిపిస్తోందని పోలీసులు ఆమెను సెప్టెంబర్ 13న అరెస్ట్ చేశారు.నిర్బంధంలో స్పృహ తప్పిపడిపోయిన ఆమె.కోమాలోకి వెళ్లిపోయారు.మూడు రోజుల తరువాత ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే.

అయితే పోలీస్ అధికారులు ఆమెను తలపై కొట్టడం వలనే చనిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.షరియా చట్టాలకు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న నిరసనలకు అంతర్జాతీయంగా మద్ధతు లభిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube