హైదరాబాద్ గాంధీభవన్ వద్ద అసంతృప్తుల ఆందోళనలు

హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ అసంతృప్త నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఈ మేరకు గాంధీభవన్ మెట్లపై కూర్చొని గాలి అనిల్ అనుచరులు నిరసనకు దిగారు.

నర్సాపూర్ నియోజకవర్గ టికెట్ ను గాలి అనిల్ కు కేటాయించకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇందులో భాగంగానే గాంధీభవన్ ఎదుట బైటాయించిన అసంతృప్త నేతలు, కార్యకర్తలు బీసీ బిడ్డ గాలి అనిల్ కుమార్ కు అన్యాయం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కాంగ్రెస్ బచావో.కోవర్ట్ హఠావో అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.

అయితే నర్సాపూర్ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆవుల రాజిరెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే.

Advertisement
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు