వైరల్: నిలువెత్తు ప్రేమకు నిదర్శనం... పిల్ల ఏనుగుని కాపాడుకుంటున్న ఏనుగు ఫామిలీ!

కుటుంబ వ్యవస్థ అనేది మన భారతీయ సంస్కృతిలో ఓ కలికితురాయి అని చెప్పుకోవాలి.మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాలు ముందు అలోచించి మనకంటూ ఓ పటిష్టమైన కుటుంబం అనే మంచి వ్యవస్థను ఏర్పాటు చేశారు.

 Proof Of Vertical Love ... Elephant Family Protecting Baby Elephant! Elephant L-TeluguStop.com

అందుకే ముఖ్యంగా మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటోంది.అయితే కాలానుక్రమంగా మనం కూడా ఒంటరిగా గడపడానికే ఇష్టపడుతున్నాం, అది వేరే విషయం.

అయితే జంతువులలో కూడా ఇలాంటి మంచి కుటుంబ వ్యవస్థను మనం చూడవచ్చును.ఇపుడు ఈ కింద ఏనుగుల గుంపుని చూస్తే మీకే అర్ధం అవుతుంది.

బేసిగ్గా మనం మన సంతానాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం.అది ప్రతి జీవికి అప్ప్లై అవుతుంది.

ఇక్కడ వీడియో మీరు చూసినట్లయితే, పెద్ద ఏనుగులు కలిసికట్టుగా ఈ VIPలు, రాజకీయ నేతలు, సెలబ్రెటీలకు మల్లే తమ పిల్ల ఏనుగుకి Z+ కేటగిరీ భద్రత కల్పించినట్టు కల్పిస్తున్నాయి.ఈ భద్రత చూస్తే మీరు కూడా అవాక్కవ్వక తప్పదు.

వివరాల్లోకి వెళితే, కోయంబత్తూర్‌లోని సత్యమంగళం ప్రాంతంలో ఓ ఏనుగుల గుంపు రోడ్డుపై నడిచి వస్తుంది.అయితే ఆ ఏనుగుల గుంపులోని కాళ్ల మధ్యలో ఓ పిల్ల ఏనుగుని మీరు గమనించవచ్చు.

ఒకసారి చూడండి.

Telugu Elephant Love, Latest-Latest News - Telugu

ఇక అది బయటకు వచ్చిన ప్రతిసారీ ఆ ఏనుగుల గుంపు అది కనిపించకుండా భద్రంగా ముందుకు తీసుకువెళ్తున్నాయి.ఈ ఆసక్తికర ఘటనను ఎవరో వీడియో తీయగా ‘సుశాంత నంద’ అనే IFS ఆఫీస‌ర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.షేర్ చేస్తూ ఈ విధంగా కామెంట్ చేశారు….“ఈ భూమ్మీద ఎవ‌రూ కూడా అంత భ‌ద్ర‌త క‌ల్పించ‌లేరు.అది కేవ‌లం ఏనుగుల గుంపునకే సాధ్య‌మైంది.

అప్పుడే పుట్టిన పిల్ల ఏనుగుకు మిగ‌తా ఏనుగులు జ‌డ్ ప్ల‌స్ ప్ల‌స్ ప్ల‌స్ కేటగిరి భ‌ద్ర‌త క‌ల్పించాయి.కావాలంటే చూడండి!” అని పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో సదరు వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube