గత కొన్ని రోజులుగా బాలీవుడ్ సక్సెస్ విషయంలో వెనుకబడి ఉంది.టాలీవుడ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంటే బాలీవుడ్ మాత్రం సొంత ఇండస్ట్రీలో కూడా సత్తా చాటడం లేదు.
స్టార్ హీరోలు సైతం గత ఏడాది పట్టుమని 100 కోట్లు రాబట్టలేక పోయారు.మరి ఇప్పుడు కొత్త ఏడాదిలో అయినా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని చూస్తుంది.
మరి ఇప్పుడు ముందు వరుసలో షారుఖ్ ఖాన్ ఉన్నాడు.ఈయన తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.బాలీవుడ్ కింగ్ ఖాన్ ప్రెసెంట్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.కమర్షియల్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది.
ఇక కింగ్ ఖాన్ ఏకంగా 4 ఏళ్ల గ్యాప్ ఇచ్చి మరీ ఇప్పుడు కొత్త సినిమాతో రాబోతున్నాడు.

సాలిడ్ హిట్ తో ఈసారి మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకోవాలని ఆశ పడుతున్నాడు.ప్రెసెంట్ ఈయన నటిస్తున్న సినిమాల్లో పఠాన్ ఒకటి.యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించారు.
బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో షారుఖ్ కు జోడీగా దీపికా నటిస్తుంది.ఇక ఇటీవలే ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అయిన విషయం తెలిసిందే.ఈ ట్రైలర్ కు అన్ని వర్గాల వారి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ను నెక్స్ట్ లెవల్ కు చేరిపోయింది.
తాజాగా వరల్డ్ బిగ్గెస్ట్ హోటల్ బుర్జ్ ఖలీఫా మీద పఠాన్ ట్రైలర్ ప్రదర్శితం అవ్వడంతో కావాల్సినంత ప్రమోషన్ వచ్చేసింది.ఈ నెల 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో అయిన బాలీవుడ్ కు గత వైభవం లభిస్తుందో లేదో చూడాలి.







