ఈ మధ్య గిఫ్ట్ లు ఇవ్వడం షరా మాములుగా మారిపోయింది.సినిమా హిట్ అయితే చాలు ఆ డైరెక్టర్ కు, హీరోకు నిర్మాతల నుండి భారీగా గిఫ్టులు అందుతున్నాయి.
ఒక్కోసారి విజయం వచ్చిన సంతోషంగా హీరోలు డైరెక్టర్లకు, డైరెక్టర్లు హీరోలకు కూడా బహుమతులు ఇచ్చుకుంటున్నారు.అయితే ఇదంతా సినిమా రిలీజ్ అయినా తర్వాత జరిగే ప్రాసెస్.
కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కాకుండానే గిఫ్టులు ఇచ్చారు నిర్మాతలు.
ఇంతకీ ఆ నిర్మాతలు ఎవరు? ఏ డైరెక్టర్ గిఫ్ట్ అందుకున్నాడో తెలుసా.ఈ ఏడాది జరిగిన జాతీయ అవార్డుల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అందుకున్న కథ రచయిత మరియు నిర్మాత సాయి రాజేష్.ఇతడు కలర్ ఫోటో సినిమాకు ఈ అవార్డు అందుకున్నాడు.2020లో రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే.ప్రెజెంట్ సాయి రాజేష్ ఆనంద్ దేవరకొండ తో ”బేబీ” సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
మాస్ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్ కే ఎన్, డైరెక్టర్ మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ చివరి దశలో ఉంది.
విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆల్బమ్ అందుబతంగా ఉందట.
ఇక ఈ సినిమా నుండి త్వరలోనే ఫస్ట్ సాంగ్ ఇంకా టీజర్ రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా రష్ చూసిన నిర్మాతలు ఆనందంగా ఉన్నారట.
తాము కోరుకున్న దాని కంటే మరింత అద్భుతంగా తెరకెక్కించాడు అనే ఆనందంలో సాయి రాజేష్ కు నిర్మాతలు ఎస్ కే ఎన్ మరియు మారుతి ఇద్దరు కలిసి ఖరీదైన కారును బహుమతిగా అందించారట.
దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నిర్మాతలకు ఎంత నమ్మకం ఉంటే ఇలా రిలీజ్ అవ్వకుండానే ఖరీదైన బహుమతి ఇస్తారు.ఇక త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు.మరి నిర్మాతలకు నచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.