సోనూసూద్ ముందర క్యూ కడుతున్న దర్శక నిర్మాతలు...!

ప్రపంచంలో ఎవరైనా సరే.ప్రస్తుతం ట్రెండ్ ఏ విధంగా నడుస్తోంది, ఎవరైతే పాపులర్ గా ఉన్నారో వారి వైపు అందరి కళ్ళు ఉంటాయి.

ఇక అందులో సినిమా వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొంత పాపులారిటీ ఏ వ్యక్తికైనా వచ్చిందంటే చాలు వెంటనే వారిని వారి సినిమాల్లో నటించాలని వారివెంట తెగ క్యూ కడుతుంటారు.

అయితే ఇలాంటి పాపులారిటీని కొంతమందికి బాగా క్యాష్ చేసుకోవడం కూడా తెలుసు.ఇక అసలు విషయంలోకి వెళితే.

ఇప్పుడు అనేకమంది దర్శకనిర్మాతల కళ్లు బాలీవుడ్ యాక్టర్ సోనుసూద్ పై పడ్డాయి.లాక్ డౌన్ సమయంలో అనేకమందికి తన సొంత డబ్బులతో సేవ చేసి అందరితో రియల్ హీరో అనిపించుకున్నాడు.

Advertisement

సోషల్ మీడియా సైతం సోను ని పొగడ్తలతో ముంచెత్తడంతో ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఆయన వైపు క్యూ కడుతున్నారు.కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో వలస రైతులకు ఆయన ఒక ఆపద్బాంధవుడిగా పేరుపొందిన సోను సూద్ కి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక కోట్ల మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు.

రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, వ్యవస్థలు చేయాల్సిన కొన్ని పనులను తాను ఒక్కడే చేసి అందరితో శభాష్ అనిపించుకున్న వ్యక్తి సోను సూద్.అలాంటి వ్యక్తి తాజాగా లాక్ డౌన్ ముగిసిన తదుపరి మొట్టమొదటిసారి హైదరాబాదులో అడుగుపెట్టాడు.

ఇలా అడుగుపెట్టిన సోనూసూద్ ను ఎయిర్ పోర్ట్ లోనే చాలామంది ఆయనను గుర్తించి సెల్ఫీలు దిగడానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు.ప్రస్తుతం ఆయన అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఆయనకు అనేక ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

కొత్త కొత్త కథలు కొత్త పాత్రలు అన్నీ కూడా ప్రస్తుతం సోను సూద్ను వెతుక్కుంటూ వస్తున్నాయి.ఇకపోతే సోను వచ్చిన రెండు రోజుల్లోనే ఏకంగా ఆరు మంది దర్శకులు ఆయనకు కథలు వినిపించారని సమాచారం.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఇందులో కొన్ని సినిమాలలో విలన్ పాత్రలు ఉంటే, మరికొన్ని హీరోల క్యారెక్టర్లు ఉన్నాయని సమాచారం.అయితే హీరోగా ఓ అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి సినిమా మొదలవుతుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జోరందుకుంది.

Advertisement

అంతేకాదు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగు సినిమాలకు పైగా విలన్ పాత్రలో సోనూసూద్ సైన్ చేశారట కూడా.మంచి పనులకు ఈ గుర్తింపును ఇవ్వడం కావచ్చు లేకపోతే సోనుసూద్ కు ప్రజల్లో ఉన్న క్రేజి ఫాలోయింగ్ వల్ల దర్శక నిర్మాతలు వారి సినిమాల్లో ఆయనను తీసుకోవడానికి కారణం అని భావించవచ్చు కూడా.

కాకపోతే ఈ లాక్ డౌన్ సమయంలో చేసిన పనుల కంటే ముందే ఆయనలో ఓ మంచి నటుడు దాగి ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే.చూడాలి మరి ఇప్పుడు హీరోగా కూడా నటించి మెప్పించగలడో లేదో.

తాజా వార్తలు