ఆ స్టార్ నిర్మాత కారణంగా అప్పుల్లో శర్వానంద్..తన కాఫీ షాప్ ని కూడా అమ్మకం కి పెట్టేసాడా?

మన టాలీవుడ్ లో డబ్బుల కోసం, కమెర్షియాలిటీ కోసం సినిమాలు చెయ్యకుండా, కేవలం తమ మనసుకి నచ్చే మంచి సినిమాలు చేసే హీరోలలో ఒకడు శర్వానంద్.( Sharwanand ) కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రల ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించిన శర్వానంద్, ఆ తర్వాత హీరో గా మారి, ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు.

ఈరోజు శర్వానంద్ పెద్ద హీరో అయ్యుండకపోవచ్చు.కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన కెరీర్ లో ఆణిముత్యాలు లాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి.

ఇది కాదు అనలేని నిజం.మధ్యలో కొన్ని భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి కానీ, అదే రేంజ్ ఫామ్ ని నాని మరియు విజయ్ దేవరకొండ లాగ కొనసాగించలేకపోయాడు.

అరడజను ఫ్లాపుల తర్వాత గత ఏడాది ఆయన ఒకే ఒక జీవితం ( Oke Oka Jeevitam ) అనే చిత్రం తో బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు.

Advertisement

ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య( Sriram Aditya ) అనే నూతన దర్శకుడితో శర్వానంద్ ఒక సినిమా చేస్తున్నాడు.ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.ఇవన్నీ పక్కన పెడితే శర్వానంద్ ఇతర హీరోలు లాగా భారీ రెమ్యూనరేషన్ ( Remuneration ) డిమాండ్ చేసే హీరో కాదు.

తన మార్కెట్ కి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ తీసుకునే వాడు.కానీ ఒక నిర్మాత( Producer ) నుండి శర్వానంద్ కి చాలా టార్చర్ ఎదురు అయ్యిందట.తనతో ముందు కమిట్ అయిన రెమ్యూనరేషన్ లో కేవలం కోటి రూపాయిల అడ్వాన్స్ ఇచ్చి, పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా తప్పించుకున్నాడట.

శర్వానంద్ పాపం అప్పుడు చాలా కష్టమైన పరిస్థితి లో ఉన్నాడు.ఆయనకీ ఎమర్జెన్సీ గా డబ్బులు కావాల్సి వచ్చింది.

తనకి రావాల్సిన అమౌంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ, ఆ నిర్మాత మాత్రం శర్వానంద్ తో మాట్లాడేందుకు ముఖం చాటేస్తూ వచ్చాడు.పోనీ సినిమా ఫ్లాప్ అయ్యి అలా చేశాడా అంటే అది కూడా కాదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆ చిత్రం అటు కమర్షియల్ గా ఇటు డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్ పరంగా మంచి లాభాలను తెచ్చి పెట్టింది.అయినప్పటికీ కూడా ఆ నిర్మాత శర్వానంద్ కి డబ్బులు ఎగ్గొట్టాడు.పాపం ఆ సమయం లో చేసేది ఏమి లేక తన అవసరం ని తీర్చుకోవడం కోసం తాను ఎంతో ప్రేమతో నిర్మించుకున్న కాఫీ షాప్ ని( Coffee Shop ) తాకట్టు పెట్టి డబ్బులు తెచుకున్నాడట.

Advertisement

ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక సినిమా పెద్ద సూపర్ హిట్ అయ్యింది, శర్వానంద్ కి మంచి రెమ్యూనరేషన్ వచ్చింది, తాకట్టు పెట్టిన కాఫీ షాప్ ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాడు.

తాజా వార్తలు