మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన RRR సినిమా కోసం అభిమానులు గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా మార్చి 25 వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది.
ఇలా ఈ సినిమా ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా భారీ కలెక్షన్లను రాబడుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ఇకపోతే ఈ సినిమా రామ్ చరణ్ కు ఎంతో ప్రత్యేకమైన చెప్పాలి.
ఇక రామ్ చరణ్ ఆదివారం (మార్చి 27)తన పుట్టినరోజును జరుపుకోవడంతో పెద్ద ఎత్తున అభిమానుల నుంచి సినీ సెలబ్రిటీల నుంచి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత పీవీపీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా రామ్ చరణ్ పై పెద్ద ఎత్తున రిసెప్షన్ కురిపించారు.
ఈ సందర్భంగా పీవీపీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ చిరంజీవి కొడుకు కూడా మరొక చిరంజీవే అంటూ చరణ్ పై ప్రశంసలు కురిపించారు.

రామ్ చరణ్ చిరంజీవి కొడుకు అనే స్థాయి నుంచి చరణ్ తండ్రి చిరంజీవి గారు అనే స్థాయికి తన నటనతో దేశం మొత్తాన్ని మెప్పించిన నటుడు రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు.ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక రామ్ చరణ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో తన తదుపరి చిత్రాల పై మరిన్ని అంచనాలు పెరిగాయి.







