అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో నేడు టిడిపి నాయకుడు ప్యారిజాన్ కుమార్తె వివాహానికి స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు.ఈరోజు ఉదయం హిందూపురం మండలం తూముకుంట చెక్ పోస్ట్ లో ఎమ్మెల్యే బాలకృష్ణకు టిడిపి కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు.
చెక్ పోస్ట్ నుండి హిందూపూర్ పట్టణంలోని ఆర్ కె ఫంక్షన్ హాల్ చేరుకున్న బాలయ్య, పెళ్ళి మండపంలో నూతన వధూవరులకు ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.వివాహ వేడుక అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతున్నట్లు టిడిపి వర్గాలు తెలిపారు.







