Naga Vamsi : పెద్ద హీరోల సినిమాలలో లాజిక్ లు చూడవద్దు.. నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో నిర్మాత నాగవంశీ( Naga Vamsi ) కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.మరికొన్ని రోజుల్లో సితార బ్యానర్ పై నిర్మించిన టిల్లు స్క్వేర్ మూవీ ( Tillu Square )థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

 Producer Nagavamsi Comments About Gunturu Karam Movie Details Here-TeluguStop.com

పెద్ద హీరోల సినిమాలకు లాజిక్స్ తో పని లేదని హీరోల ఎలివేషన్లను చూసి ఎంజాయ్ చేయాలని ఆయన కామెంట్లు చేశారు.సలార్ లో ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారని నాగవంశీ పేర్కొన్నారు.

కొంతమంది మాత్రం సీన్స్ లో లాజిక్ లేదని కామెంట్లు చేశారని ఆయన తెలిపారు. గుంటూరు కారం మూవీలో హీరో వెంటనే హైదరాబాద్ ఎలా వెళ్తాడని కామెంట్ చేశారని ఇలా మాట్లాడే వాళ్ల కోసం గుంటూరు నుంచి మొదలయ్యే మూడున్నర గంటల జర్నీని చూపించలేం కదా అని నాగవంశీ వెల్లడించారు.గుంటూరు కారం మూవీలో మాస్ సీన్లు లేవని త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని అన్నారని ఓటీటీలో రిలీజైన తర్వాత బాగుందని చాలామంది మెసేజ్ లు చేశారని నాగవంశీ తెలిపారు.

మహేష్( Mahesh Babu ) గత సినిమాల సాంగ్స్ ను మించి ఉండాలని కుర్చీ మడతబెట్టి సాంగ్ పెట్టామని చూసి ఎంజాయ్ చేయాలే తప్ప శ్రీలీల అక్కడకు రావడం, వెంటనే దుస్తులు మార్చుకోవడం ఏంటని కామెంట్లు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.సినిమాను వినోదం కోసమే తీస్తామని గొప్ప రైటర్ అయిన త్రివిక్రమ్ కు సినిమా ఎలా తీయాలో నేర్పించాల్సిన అవసరం లేదని ఆయన కామెంట్లు చేశారు.సినిమా బాగోలేదని కామెంట్ చేసే అర్హత ఎవరికైనా ఉంటుందని కానీ చిత్ర బృందం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడకూడదని నాగవంశీ పేర్కొన్నారు.

నాగవంశీ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.టిల్లు స్క్వేర్ సినిమాతో నాగవంశీ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube