వీరయ్యను మించేలా డాకు మహారాజ్.. నాగవంశీ అంచనాలను పెంచారుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలలో నాగవంశీ( Nagavamshi ) ఒకరు కాగా సంక్రాంతి పండుగకు డాకు మహారాజ్ సినిమాతో ( movie Daku Maharaju )ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ మెగాస్టార్ ఫ్యాన్స్ తిట్టుకున్నా పరవాలేదని ‘వాల్తేరు వీరయ్య’ కంటే ‘డాకు మహారాజ్‌’ సినిమాని బాగా తీశారని చెప్పుకొచ్చారు.

శ్రద్థా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు.జనవరి నెల 4వ తేదీన అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది.

జనవరి 8వ తేదీన ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Pre-release event )జరగనుందని సమాచారం అందుతోంది.నాగవంశీ మాట్లాడుతూ బాలకృష్ణతో వర్క్‌ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో బాలయ్యను కొత్తగా చూస్తారని కామెంట్లు చేశారు.బాలయ్య ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా ఇలాంటి లుక్ లో కనిపించలేదని ఆయన అన్నారు.

Advertisement

లెజెండ్, అఖండ సినిమాల గురించి ఏ విధంగా మాట్లాడుకుంటారో ఈ సినిమా గురించి సైతం అదే విధంగా మాట్లాడతారని ఆయన చెప్పుకొచ్చారు.డాకు మహారాజ్ ఇంటర్వెల్ సీన్ చూసి నాకు కాల్ చేసి ఈ మాట చెబుతారని నాగవంశీ వెల్లడించారు.జనవరి 2న హైదరాబాద్‌లో ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్నామని ఆయన పేర్కొన్నారు.

బాలయ్య దర్శకుడు ఏం చెబితే అది చేస్తారని బాబీ తెలిపారు.

షూటింగ్‌ సమయంలో ఏదైనా దెబ్బ తగిలినా బాలయ్య ఎవరికీ చెప్పరని ఆయన చెప్పుకొచ్చారు.ఈ సినిమాలో థియేటర్‌ దద్దరిల్లిపోయే మాస్‌ సాంగ్‌ ఉందని త్వరలోనే ఆ పాటను సైతం విడుదల చేస్తామని బాబీ వెల్లడించారు.డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య సినీ కెరీర్ లో గతంలో ఏ సినిమా తెరకెక్కనంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు