స్టార్ హీరో అల్లు అర్జున్ నేషనల్ అవార్డును (allu arjun , national award )రద్దు చేయాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.బన్నీ(Bunny) నేషనల్ అవార్డ్ రద్దు చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంధ్య థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో బన్నీ ప్రమేయం ఉన్నా ఆ ఘటనకు బన్నీ మాత్రమే కారణం కాదు.రేవతి(Revathi), ఆమె కొడుకు మృతి విషయంలో ఎంతోమంది తప్పులు కారణం అని చెప్పవచ్చు.
కొడుకును రక్షించాలనే ప్రయత్నంలో రేవతి మృతి చెందారు.బన్నీకి నేషనల్ అవార్డును రద్దు చేయాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపితున్నాయి.మరోవైపు పుష్ప సినిమా గురించి మంత్రి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.స్మగ్లర్ పోలీసులను దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ అవార్డ్ ఇవ్వడం దేనికి సంకేతం అని సీతక్క అన్నారు.
జై భీమ్(Jai Bhim) లాంటి సినిమాలకు మాత్రం ప్రోత్సాహకాలు, అవార్డులు అందలేదని ఆమె చెప్పుకొచ్చారు.
పుష్ప(puspa) సినిమాలో పోలీస్ ను విలన్ చేసి స్మగ్లర్ ను హీరో చేశారని సీతక్క(Seethakka) వెల్లడించారు.మానవతాదృక్పథం ఉన్న సినిమాలు రావాల్సిన అవసరం ఉందని పుష్ప లాంటి సినిమాలు నేరాలను పెంచే విధంగా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో రాహుల్ రామకృష్ణ సైతం తన కామెంట్లను వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది.అల్లు అర్జున్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.బన్నీ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలు అందుకుంటారో చూడాలి.ఈ వివాదాలు బన్నీ భవిష్యత్తు సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.బన్నీ పారితోషికం 200 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందనే సంగతి తెలిసిందే.