విశ్వక్ సేన్( Vishwak Sen ) గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ( Gangs Of Godavari ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇదివరకు ప్రకటించారు.అయితే ఉన్నఫలంగా ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు రావడంతో హీరో విశ్వక్ సైతం ఈ సినిమా వాయిదా పట్ల తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ఎలాంటి వివాదాలకు కారణమైందో మనకు తెలిసిందే.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు.నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెప్తున్నా.డిసెంబర్ 8న గ్యాంగ్స్ అఫ్ గోదావరి వస్తుంది.హిట్, అట్టర్ ఫ్లాప్ అనేది మీ డెసిషన్.గంగమ్మ తల్లికి నా ఒట్టు.మహాకాళి నాతో ఉంది.
డిసెంబర్ లో సినిమా రిలీజవ్వకపోతే నేను ఇక ప్రమోషన్స్ లో కనబడును అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది.ఇలా 8వ తేదీ సినిమా విడుదల చేయకపోతే ప్రమోషన్లకు రానని చెప్పడం సరి కాదు అంటూ కొందరు ఈ పోస్ట్ పై కామెంట్లు కూడా చేశారు.
అయితే తాజాగా విశ్వక్ చేసినటువంటి ఈ కామెంట్లపై నిర్మాత నాగ వంశీ ( Naga Vamshi ) స్పందించారు.
ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ.మేము ముందుగానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని డిసెంబర్ 8వ తేదీ విడుదల చేయాలి అనుకున్నాము.అయితే ఈ తేదీకి వరుణ్ తేజ్ సినిమా మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు.
ఆ తర్వాత నాని హాయ్ నాన్న సినిమా, నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు కూడా ఇదే తేదీన విడుదల కాబోతున్నాయి అయినప్పటికీ మేము ఈ సినిమా వాయిదా వేసాము అని ఎక్కడ ప్రకటించకపోయినా విశ్వక్ ఎందుకు అలా రియాక్ట్ అయ్యారో తమకు తెలియదని, ఈ విషయం మీరు తనని అడగాలని నాగ వంశీ మాట్లాడారు.ఇక ఈ సినిమాలో మరొక సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందని అది పూర్తి అయిన తర్వాత సినిమా అవుట్ పుట్ చూసి మాకు కాన్ఫిడెన్స్ అనిపిస్తేనే సినిమాని ఎనిమిదో తేదీ విడుదల చేస్తామని అంతవరకు ఎవరు వాయిదా అన్నమాట మాట్లాడకూడదంటూ ఈ సందర్భంగా నాగ వంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.