ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. భారీ బ్లాక్ బస్టర్ ఖాయమా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న హిట్ కాంబినేషన్లలో అల్లు అర్జున్( Allu Arjun ) దిల్ రాజు( Dil Raju ) కాంబినేషన్ కూడా ఒకటి.

ఈ కాంబినేషన్లో తెరకెక్కిన ఆర్య, పరుగు, డీజే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలకు మించి విజయం సాధించాయి.

నిర్మాత దిల్ రాజు పై ఉన్న అభిమానంతో అల్లు అర్జున్ ఎవడు సినిమాలో గెస్ట్ రోల్ లో కూడా నటించారు.అయితే నిర్మాత దిల్ రాజు పరిస్థితి గత కొంతకాలంగా ఆశాజనకంగా లేదు.

ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన గేమ్ చేంజర్ సినిమా( Game Changer ) నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమా సక్సెస్ సాధించినా గేమ్ చేంజర్ నష్టాలను ఆ సినిమా పూర్తి స్థాయిలో భర్తీ చేయడం సాధ్యం కాదు.

Producer Dil Raju Planning Movie With Allu Arjun Details, Allu Arjun, Dil Raju,

ఇలాంటి సమయంలో దిల్ రాజు అల్లు అర్జున్ డేట్లు సంపాదించారని తెలుస్తోంది.అల్లు అర్జున్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తిచేసిన తర్వాత దిల్ రాజు నిర్మించే సినిమాతో బిజీ కానున్నారు.ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.

Advertisement
Producer Dil Raju Planning Movie With Allu Arjun Details, Allu Arjun, Dil Raju,

ప్రస్తుతం బన్నీతో సినిమాను నిర్మించాలంటే కనీసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం బన్నీ సినిమాలు అంచనాలకు మించి విజయం సాధిస్తున్నాయి.అల్లు అర్జున్ కెరీర్ గ్రాఫ్ సైతం బాగుంది.2020 సంవత్సరం నుంచి బన్నీ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ సాధిస్తోంది.

Producer Dil Raju Planning Movie With Allu Arjun Details, Allu Arjun, Dil Raju,

బన్నీకి జోడిగా నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ పరంగా కూడా బన్నీ ఇతర హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నారు.అల్లు అర్జున్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చిన సందర్భాలు సైతం ఒకింత తక్కువగానే ఉన్నాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న బన్నీ భవిష్యత్తు సినిమాలతో మరిన్ని సంచలన విజయాలను అందుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో ములక్కాయ‌ తిన‌కూడ‌ద‌ట‌.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు