ప్రభాస్ కి ఏమిచ్చిన రుణం తీరదు.. ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కామెంట్స్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) నటించిన కల్కి సినిమా( Kalki Movie ) ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ఈ సినిమా నిర్మాత వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ ( Aswini dutt ) ను కొంతమంది ప్రభాస్ అభిమానులు ఘనంగా సన్మానించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా అశ్వినీ దత్ కల్కి 2 గురించి పలు ఆసక్తికరమైన విషయాలను మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా అశ్వినీ దత్  మాట్లాడుతూ.కల్కి సినిమా ఇంత గొప్ప సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ప్రభాస్ అని తెలిపారు.మనం ఏం చేసినా ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేమని వెల్లడించారు.

కల్కి పార్ట్ 2 మాత్రం ఇంతవరకూ తెలుగులో ఎవరూ తీయని విధంగా వస్తుందని ఈయన వెల్లడించారు.కానీ ఎప్పుడు విడుదలవుతుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు కానీ గత ఇంటర్వ్యూలలో భాగంగా ఈయన ఈ సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ 2026 వేసవి సెలవులకు రాబోతుందని తెలిపారు.

Advertisement

ఇప్పటికే దాదాపు 60% షూటింగ్ పూర్తి అయినట్లు పలు ఇంటర్వ్యూలలో అశ్వినీ దత్ పేర్కొన్నారు.అయితే కల్కి సినిమాటిక్ యూనివర్స్ మొత్తం ఎన్ని భాగాలు ఉండే అవకాశం ఉందనేదానిపై కూడా దత్ తెలిపారు.ప్రస్తుతం ఈ సినిమా పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దాని తర్వాత సుప్రీం యాస్కిన్ లీడ్‌ రోల్‌లో ఓ సినిమా వస్తుందని చెప్పారు.ముఖ్యంగా పార్ట్ 2లో ప్రభాస్ -కమల్ హాసన్ మధ్య భారీ పోరాట సన్నివేశాలు ఉంటాయని వెల్లడించారు.

ఏది ఏమైనా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ పై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు