పార్టీని కాపాడుకునేందుకు ప్రియాంక గాంధీ అంత పని చేసేనా...?

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ( Sonia Gandhi ) రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెల్సిందే.ఆమె కాంగ్రెస్ బాధ్యతల నుండి తప్పుకోవడంతో కొత్త రక్తం చేరాల్సిన అవసరం ఉంది.

 Priyanka Gandhi Step In Telangana Political Issues  , Priyanka Gandhi ,telangana-TeluguStop.com

ఈ సమయంలో గత కొంత కాలంగా పార్టీ లో ఉంటూనే కాస్త దూరం మెయింటెన్ చేస్తున్న సోనియా గాంధీ కూతురు.రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టడం కన్ఫర్మ్‌ అయ్యింది.

Telugu Congress, Nalgonda, Priyanka Gandhi, Revanth Reddy, Ts-Telugu Political N

2024 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ప్రియాంక గాంధీ( Priyanka gandhi ) క్రియాశీలక పాత్ర పోషించబోతుంది.అంతే కాకుండా ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా కన్ఫర్మ్‌ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ప్రియాంక గాంధీ యొక్క రాజకీయం గురించి ప్రస్తుతం ప్రముఖంగా చర్చ జరుగుతోంది.ఆమె నల్లగొండ పార్లమెంట్ నియోజక వర్గం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.ఆమె విషయమై తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు.రేవంత్ రెడ్డి( Revanth Reddy ) మరియు ఇతర ముఖ్య నేతలు ప్రియాంక గాంధీని తెలంగాణలోని నల్లగొండ పార్లమెంట్‌ నియోజక వర్గం నుండి పోటీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Telugu Congress, Nalgonda, Priyanka Gandhi, Revanth Reddy, Ts-Telugu Political N

ఆ విషయమై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ప్రియాంక గాంధీ రాజకీయంగా అడుగు వేసేందుకు గాను మరియు పార్టీని రాష్ట్రంలో మరియు దేశంలో కాపాడుకునేందుకు గాను ప్రియాంక గాంధీ అంత పని చేస్తుందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గతంలో జాతీయ నాయకులు తెలంగాణ నుడి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి.కనుక ప్రియాంక గాంధీ ఇప్పుడు నల్లగొండ పార్లమెంట్ నియోజక వర్గం నుండి పోటీ చేయడం లో తప్పేం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా ప్రియాంక గాంధీకి మరియు కాంగ్రెస్ కి కలిసి వచ్చేలా నల్లగొండ నియోజక వర్గం పని చేస్తుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube