అతని పరిచయం జీవితాన్నే మార్చేసిందంటున్న ప్రియాంక చోప్రా

మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లతో ప్రియాంక చోప్రా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.తమిళన్ అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన ప్రియాంక ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసింది.

క్రిష్, ఓం శాంతి ఓం, బర్ఫీ సినిమాలు నటిగా ప్రియాంకకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యులో ప్రియాంక మాట్లాడుతూ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన సమయంలో తనకు పెళ్లిపై ఆసక్తి ఉండేది కాదని పెళ్లి అనే మాట వింటేనే వింతగా అనిపించేదని అన్నారు.

పెళ్లి చేసుకోకూడని.పెళ్లి చేసుకోకపోతే జీవితంలో ఎంతో సాధించవచ్చని భావించానని ఆమె తెలిపారు.

అయితే నిక్ పరిచయం తరువాత తన ఆలోచనలన్నీ పూర్తిగా మారిపోయాయని ప్రియాంక అన్నారు.

Advertisement

నిక్ తో పెళ్లి అనంతరం తనకు వివాహ బంధంలోని మాధుర్యం అర్థమైందని.వివాహం విషయంలో తన ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందని తెలిపారు.జీవితంలో సరైన తోడు దొరికితే లైఫ్ పూర్తిగా మారిపోతుందని ప్రియాంక అన్నారు.

మన ఇష్టాలను, అభిరుచులను గౌరవించే భాగస్వామి సులువుగా దొరకరని.అలాంటి వ్యక్తి కోసం వెతకడం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడే మన జీవితంలో సరైన వ్యక్తి వచ్చినట్టు భావించాలని పేర్కొన్నారు.

నిక్ వల్ల తాను ప్రస్తుతం ఎంతో సంతోషకరమైన జీవనం సాగిస్తున్నానని అన్నారు.నిక్ పరిచయం జీవితాన్నే మార్చేసిందని ఆమె చెప్పారు.

రెండేళ్ల క్రితం ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ వివాహం జరిగింది.నిక్ వయస్సులో ప్రియాంక కంటే పదేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

వయస్సు పరంగా పదేళ్ల తేడా ఉన్నా ఈ జంట అన్యోన్యంగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు