ప్రియమణి( Priyamani ). ఈ భామ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
ఈమె సౌత్ మాత్రమే కాదు నార్త్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.అందంతో పాటు అభినయం కూడా ఉన్న ఈ భామ వరుస సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది.
ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగులో సైతం స్టార్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు అందరితో నటించింది.
మంచి మంచి సినిమాలనే తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ఆ తర్వాత వరుస ప్లాప్స్ కారణంగా అవకాశాలు కోల్పోయింది.ఇక మళ్ళీ పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తూ సత్తా చూపిస్తుంది.తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది.
ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ అందుకుంది.
షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ”జవాన్”( Jawan ).
ఈ సినిమాను సెప్టెంబర్ 7న రిలీజ్ చేయగా ఇప్పటికే 600 కోట్లకు పైగానే వసూళ్లు చేసింది.మరి ఈ సినిమాలో ప్రియమణి కూడా కీలక పాత్ర పోషించింది.
ఈ సినిమాలో ఈమె నటనకు కూడా మంచి గుర్తింపు లభించింది.
దీంతో ఈ అమ్మడికి ఇప్పుడు మరో అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది.అది కూడా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్( Malayalam Superstar Mohan lal ) తో నటించనున్నారని తెలుస్తుంది.మోహన్ లాల్ ‘నేరు'( Neru ) సినిమాలో ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటిస్తుంది.
ఈమె ఇప్పటికే సోషల్ మీడియా వేదికపై ఈ విషయాన్నీ చెప్పింది.ఈ సినిమా షూటింగ్ లో కూడా ఇప్పటికే పాల్గొంటుంది.
ఈ సినిమాలో ప్రియమణి లాయర్ పాత్రలో నటిస్తుందని టాక్.మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ అవకాశాలే వరిస్తున్నాయి.