Priyamani : ఆ వ్యాధి వల్లే ప్రియమణికి పిల్లలు పుట్టడం లేదా..?

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది హీరోయిన్ ప్రియమణి( Priyamani ).ఈమె అందచందాలతో పాటు తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది.

 Priyamani Is Not Having Children Because Of That Disease-TeluguStop.com

అయితే అలాంటి ప్రియమణి ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది.అంతేకాదు కొన్ని స్పెషల్ సాంగ్స్ లో అలాగే బుల్లితెర షోలకి జడ్జిగా ఇలా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది.

అలాంటి ప్రియమణి మొదట ఎవరే అతగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికి పెళ్లయిన కొత్తలో( Pellaina Kothalo ) సినిమా ప్రియమణికి మంచి పేరు తెచ్చి పెట్టింది.ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాల్లో మూవీ ఆఫర్స్ వచ్చాయి.

ఇక ప్రియమణి సినీ కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైంలోనే రెండో పెళ్లి వాడైనా ముస్తఫా రాజ్( Mustafa raj ) ని పెళ్లి చేసుకుంది.అయితే ఆయనకు అప్పటికే అయేషా అనే అమ్మాయితో పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు.

Telugu Ayesha, Evare Athagadu, Kollywood, Mustafa Raj, Priyamani, Tollywood-Movi

అయినప్పటికీ ప్రియమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అయితే ఆ మధ్యకాలంలో ప్రియమణి ముస్తఫా రాజ్ ఇద్దరు విడిపోతున్నట్లు వార్తలు వినిపించాయి.కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని ప్రియమణి క్లారిటీ ఇచ్చింది.ఇక ప్రియమణికి పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది.ఈ మధ్యకాలంలో పెళ్లి అయినా చాలా మంది హీరోయిన్లు పెళ్లయిన రెండు మూడు సంవత్సరాలకే పిల్లల్ని కంటున్నారు.కానీ ప్రియమణి ( Priyamani ) ఇన్ని రోజులైనా పిల్లల ఊసే ఎత్తడం లేదు.

ఇక దీనికి కారణం ప్రియమణి సినిమా అవకాశాలు తగ్గుతాయనే కారణంతోనే పిల్లల్ని కనడం లేదని,అలాగే తన గ్లామర్ ఎక్కడ దెబ్బతింటుందో అని పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు అంటూ ఎన్నో వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.

Telugu Ayesha, Evare Athagadu, Kollywood, Mustafa Raj, Priyamani, Tollywood-Movi

అయితే టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.ప్రియమణి( Priyamani ) యుటేరస్ మరియు థైరాయిడ్ అనే వ్యాధులతో బాధపడుతుందట.ఈ కారణం తోనే ఆమెకు పిల్లలు పుట్టడం కష్టం అని డాక్టర్లు చెప్పారట.

ఇప్పటికే పిల్లల విషయంలో ఎంతగానో ప్రయత్నించి, ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నప్పటికీ ప్రియమణి దంపతులకు ఈ కారణంగానే పిల్లలు పుట్టడం లేదట అయితే డాక్టర్లు ప్రియమణికి సరోగసి పద్ధతి బెస్ట్ అని చెప్పినప్పటికీ ప్రియమణికి ఇష్టం లేదట.కానీ ఈ విషయంలో ముస్తఫా రాజ్( Mustafa raj ) మాత్రం ప్రియమణి ని సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కందామని ఇబ్బంది పెడుతున్నారట.

మరి ప్రియమణి సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కంటుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube