దోపిడీకి నిల‌యాలుగా మారుతున్న ప్రైవేట్ ​జూనియ‌ర్‌ క‌ళాశాల‌లు.. కరోనా కాలంలో ఆగని కాసుల వేట.. ?

కరోనా వచ్చింది కావలసినంత ఆదాయాన్ని లేకుండా చేసింది.ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సామాన్యుడు కుస్తీ పడుతుంటే, మరో వైపు పిల్లల చదువులు, వారి ఫీజులు గుండెనొప్పిని తెప్పిస్తున్నాయి.

 Private Junior Colleges Becoming Centers Of Exploitation Private, Junior College-TeluguStop.com

ఏ విషయంలో చూడు దోపిడికి దారులు తెరిచే ఉంటున్నాయి.

ఇకపోతే ప్రస్తుతం సమాజంలో పెద్ద సమస్యగా మారిన విషయం పిల్లల ఫీజులు.

సగటు జీవి ఆదాయం మాత్రం పెంచలేని ప్రభుత్వాలు, ఖర్చులను మాత్రం మోపుకట్టి నెత్తిన పెడుతున్నాయి.దీని ఫలితంగా కరోనా కాలంలో కార్పొరేట్ ​విద్యా సంస్థల కాసుల వేటలో తల్లిదండ్రులు అల్లాడుతున్నారు.

ఇవేవి పట్టని విద్యాసంస్దలు అందినకాడికి దండుకునేందుకు విశ్వప్రత్నాలు చేస్తున్నాయి.

ఇందులో భాగంగా మొత్తం ఫీజు చెల్లిస్తేనే క్లాసులు, హాస్టల్ కు అనుమతి అంటూ విద్యార్థులను వేధించుకు తింటున్నాయి.

కేవలం నెలరోజులు మాత్రమే కొనసాగడం, మళ్లీ విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేయడం, ఇదే నెలలో ఇంటర్మీడియట్​ విద్యార్థులకు ఎథిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ప‌రీక్ష ఉండడంతో హాల్​టికెట్​ పేరిట మొత్తం ఫీజులు వసూలు చేస్తున్నాయి.

Telugu Demand Fees, Private-Latest News - Telugu

హ‌న్మకొండ‌లోని పలు కాలేజీలు రూ.40వేల వరకు వసూలు చేస్తుండగా, కార్పొరేట్ కాలేజీలు రూ.ల‌క్షకు పైగా వసూలు చేస్తున్నాయి.

విద్యార్థులకు ఒక నెల క్లాసులు, హాస్టల్​ వసతి కల్పించి ఏడాది మొత్తానికి ఫీజులు చెల్లించాలనడం ఎంతవరకు సబబని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఇదే కాకుండా ఆన్‌లైన్ పేరిట గాలి చ‌దువులు చెబుతున్న విద్యాసంస్దలు పిల్లల‌కు స‌రైన విద్య అంద‌క‌పోగా, వేలాది రూపాయాలు ఫీజుల రూపంలో ఉత్త పుణ్యానికి ముట్టజెప్పాల్సి వ‌స్తోంద‌ని బాధపడని పేరెంట్స్ లేరు.

ఇక ఈ విషయంలో మీడియా కోడై కూస్తున్నగానీ అధికారులకు చీమకుట్టినట్లు కూడా అవ్వడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube