మీరు ప్రధాని...ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ కాదు

నిన్నటిదాకా మూడు దేశాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ తన గొప్పలు చెప్పుకోవడంతోబాటు పదేళ్ల యూపీయే పరిపాలనను కూడా కడిగిపారేశారు.

తన లక్ష్యం స్కిల్‌ ఇండియాయేగాని స్కామ్‌ ఇండియా కాదని యూపీఏ పాలనను దుయ్యబట్టారు.

కాంగ్రెసు పరిపాలన దేశాన్ని చెత్త చెత్త చేసిందన్నారు.ఇప్పుడు దాన్ని తాము శుభ్రం చేస్తున్నామన్నారు.

నరేంద్ర మోదీ ఈ ధోరణి కాంగ్రెసు పార్టీకి తీవ్ర ఆగ్రహం కలిగించింది.మోదీపై కారాలు మిరియాలు నూరుతోంది.

అందులోనూ విదేశాల్లో తమ పరిపాలనపై విమర్శలు చేయడంతో మీరు ప్రధానిగా వ్యవహరించండి.ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌లా కాదు.

Advertisement

అని చురకలు వేసింది.తమ పరిపాలన గురించి చెడుగా మాట్లాడినందుకు మోదీ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్‌ చేస్తోంది.

మోదీ వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితి సరిగాలేదనే విషయం తెలియచేస్తున్నాయని విమర్శించింది.దేశ రాజకీయాల గురించి విదేశాల్లో మాట్లాడకూడదనే సంప్రదాయాన్ని కాలరాశారని మండిపడింది.

ఇలాంటి ప్రవర్తనను తాము ఎక్కువకాలం సహించబోమని కాంగ్రెసు నాయకుడు ఆనంద్‌ శర్మ అన్నారు.ఎక్కడైనా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని మోదీకి హితవు పలికారు.

కాంగ్రెసు పాలన గురించి మోదీ విదేశాల్లో చెప్పడం తప్పా, కాదా అనే సంగతి మనం చెప్పలేంగాని ఆ కుంభకోణాల పాలన గురించి ఎవరికి తెలియదు? మోదీ చెప్పకపోయినా విదేశాలవారికి అన్ని సంగతులూ తెలుసు.చెప్పినందువల్ల ప్రత్యేకంగా పరువేం పోదు.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు