హైదరాబాద్ కి ధన్యవాదాలు తెలియజేసిన ప్రధాని మోదీ..!!

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ( Prime Minister Modi ) సోమవారం హైదరాబాద్ లో భారీ ర్యాలీలో పాల్గొన్నారు.హైదరాబాద్ లో దాదాపు 20కి పైగా నియోజకవర్గాలను కవర్ చేసే రీతిలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు.

 Prime Minister Modi Thanked Hyderabad , Telangana Elections, Prime Minister Modi-TeluguStop.com

ఈ సందర్భంగా రోడ్డు షోలో ప్రజల నుండి వచ్చిన స్పందనను వారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.హైదరాబాద్ ( Hyderabad )కి ధన్యవాదాలు.

ఎల్లప్పుడూ నన్ను ఈ నగరం ఎంతో స్నేహపూర్వకంగా స్వాగతించింది.ఈరోజు దానికి మినహాయింపు కాదు.

ఈరోజు రోడ్ షోకి వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు అని పోస్ట్ చేయడం జరిగింది.నవంబర్ 28వ తారీకు ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ.నవంబర్ 30వ తారీకు తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.ఈరోజు మినహా రేపు ఒక రోజు మాత్రమే మిగిలి ఉండటంతో.ప్రధాన పార్టీల నాయకులు భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు.సోమవారం కరీంనగర్ లో బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని.

సీఎం కేసీఆర్( CM KCR ) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.కచ్చితంగా జరగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి.

ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ మోదీ ర్యాలీలో కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణరావు పలువురు తెలంగాణ బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube