పొట్లకాయ సాగు( Snake Gourd ) చేయడానికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.కాకపోతే సాగు చేసే విధానంపై పూర్తిగా అవగాహన ఉంటేనే పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడి పొందవచ్చు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటలలో పొట్లకాయ పంట( Snake Gourd Farming ) కూడా ఒకటి.ఈ పంట సాగులో పాటించవలసిన మెలుకువలు ఏమిటో చూద్దాం.
పొట్లకాయలు లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ అనే రెండు రకాలుగా ఉంటుంది.పొట్లకాయ సాగు చేయడానికి భూమిలో అధిక తేమ అవసరం.
ఈ పంటను జనవరి రెండో వారం వరకు విత్తుకోవచ్చు.

పందిరి విధానంలో సాగు చేస్తే వివిధ రకాల చీడపీడల బెడద, తెగుళ్ల బెడద( Pests ) ఉండదు.మొక్కలకు సూర్యరశ్మి, గాలి బాగా తగిలి ఆరోగ్యవంతంగా పెరుగుతాయి.మొక్కల మధ్య 90 సెంటీమీటర్ల దూరం, వరుసల మధ్య రెండు మీటర్ల దూరం ఉండేటట్లు సాగు చేయాలి.
పొట్లకాయ విత్తనాలు విత్తిన 5వ రోజు తేలికపాటి నీటి తడిని అందించాలి.ప్రధానంగా పూత, పిందె, కాయ దశలో ఉన్నప్పుడు నీటి తడులు సమృద్ధిగా అందించాలి.పందిరి విధానంలో సాగు చేస్తూ.ఒక్కొక్క పాదులో కనీసం నాలుగు విత్తనాలు విత్తుకోవాలి.

ఈ విత్తనాలు పది రోజులకు మొలకెత్తుతాయి.అనంతరం బలహీనంగా ఉండే మొక్కలను పీకేయాలి.మొక్క ఎదిగే సమయానికి పందిరిని అందించాలి.మొక్క మొదల వద్ద ఎప్పటికప్పుడు కలుపు నివారించాలి.ఈ పొట్లకాయ సాగుకు బూజు తెగులు, బూడిద తెగులు, వెర్రి తెగులు, ఆకుపచ్చ తెగులు ఆశిస్తాయి.కాబట్టి పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ నిపుణుల సలహా మేరకు రసాయన పిచికారి మందులను ఉపయోగించి ఈ తెగులను అరికట్టాలి.
రసాయన ఎరువులకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ సేంద్రీయ ఎరువులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.ఇలా చేస్తే అధిక దిగుబడి పొందవచ్చు.







